టాలీవుడ్ లో యాంగ్రీ యంగ్ మాన్ గా ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్న నటుడు రాజశేఖర్. నటనలో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించి, మ్యానరిజం లో తన స్టయిలే వేరు అని నిరూపించుకుని ఫ్యామిలి తరహా పాత్రలతో ప్రేక్షకులకు చేరువయ్యారు. ఫ్యామిలి ప్రేక్షకులకు అన్నయ్యగా, అక్క మొగుడుగా, అల్లరి ప్రియుడుగా అమ్మాయిల మనసులో చెరగని ముద్ర వేసాడు. ఆయన తొలి సారి 1985 లో వందేమాతరం సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయం అయ్యారు. 

 

రాజశేఖర్ అంటే ముఖ్యంగా గుర్తు వచ్చేది యాంగ్రీ యంగ్ మాన్ పాత్రలే అయినా కుటుంబ తరహా పాత్రల్లో కూడా మెప్పించారు. రాజశేఖర్ నటుడు కాకముందే ఏం బి బి ఎస్ చేసి చెన్నై లో డాక్టర్ గా ప్రాక్టిస్ చేసారు. వందేమాతరం సినిమా తర్వాత ఆయన కెరీర్ కి బ్రేక్ ఇచ్చిన సినిమా తలంబ్రాలు. లేడి ఓరియంటెడ్ చిత్రం గా తెరకెక్కిన ఈ సినిమాలో రాజశేఖర్ తనదైన విలనిజం పండించారు. ఏం ఎస్ ఆర్ట్స్ మూవీస్ సంస్థ ఆధ్వర్యంలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో జీవిత, కళ్యాణ్ చక్రవర్తి, రాజశేఖర్ కి సహ నటులుగా నటించారు. ఎం శ్యాం ప్రసాద్ రెడ్డిసినిమా ని నిర్మాతగా వ్యవహరించారు.

 

తలంబ్రాలు సినిమా యాక్షన్ సినిమాగా రాజశేఖర్ కి మంచి గుర్తింపు వచ్చింది. సంగీత పరంగా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. చల్ల పిళ్ళ సత్యం అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. ఈ సినిమాలోని “ఇది చెరగని ప్రేమకి శ్రీకారం” అనే పాట ఇప్పటికి ఎవర్ గ్రీన్ సాంగ్ గా ఉంది. ఈ సినిమా తర్వాత చాలా సినిమాల్లో జీవిత, రాజశేఖర్ జంటగా నటించారు. వీరి కాంబినేషన్  ఇండస్ట్రీలో హిట్ ఫెయిర్ గా నిలిచింది. అప్పుడే వారు ఒకరినొకరు ఇష్టపడి వివాహం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: