రామ్ పోతినేని.. ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీలో దూసుకు పోతున్న యువ కథానాయకుడు. తెలుగు, తమిళ సినిమాలలో ప్రముఖ నటుడిగా గుర్తింపు సంపాదించాడు రామ్. ఆయన స్వస్థలం హైదరాబాద్. రామ్  స్రవంతి కిషోర్ కి తమ్ముడి కొడుకు. సినిమాల మీద ఉన్న ఆసక్తి తో 2006 లో దేవదాస్ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న రామ్ ఫుల్ జోష్ తో కెరీర్ ప్రారంభించాడు. 

 

దేవదాస్ సినిమాలో కథ విషయానికి వస్తే అమెరికాలో టాప్ మిలీనియర్ కూతురిగా ఇలియానా, ఆ మిలీనియర్ పాత్రలో షాయాజీ షిండే అద్భుత నటన చూపించారు. అమెరికా నుండి చదువు కోసం ఇండియా వచ్చిన హీరోయిన్ మాస్ కుర్రాడు గా ఉన్న హీరోని ప్రేమిస్తుంది. వీరి ప్రేమకు షాయాజీ షిండే పెట్టిన పరీక్షలను గెలిచి హీరోయిన్ ని దక్కించుకునే నేపథ్యంలో ఒక మామూలు కుర్రాడు అమెరికా వెళ్లడం వంటి ఇంటరెస్టింగ్ సీన్స్ తో కథను చక్కగా మలిచారు. కొత్తగా ఉన్న ఈ కథ ప్రేక్షకులకు బాగా చేరువయ్యి అఖండ విజయాన్ని అందుకుంది.

 

వై వి యస్ చౌదరి దర్శకత్వంలో 2006 లో వచ్చిన రామ్ మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాక ఈ సినిమాకు గాను రామ్ కి ఉత్తమ నూతన నటుడు ఫిల్మ్ ఫేర్  సౌత్ అవార్డు వరించింది. ఈ సినిమాలో రామ్ సరసన ఇలియానా నటించింది. ఇలియానా కు కూడా తెలుగులో ఇదే మొదటి సినిమా. మొదటి సినిమా తో  భారీ విజయం అందుకున్న నేపథ్యంలో రామ్, ఇలియానాకు మంచి ఇమేజ్ వచ్చింది. ఇక ఆతర్వాత  రామ్ రెండవ సినిమా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన జగడం. ఇది అనుకున్నంత విజయాన్ని అందుకోలేదు. మళ్లీ రెడీ సినిమాతో ట్రాక్ లోకి వచ్చాడు రామ్. ఈ సినిమాతో ఇండస్ట్రీలో అగ్ర హీరోల జాబితాలోకి వచ్చాడు. ఈ రెండు సినిమాలు  మంచి విజయాన్ని అందిచడమే కాక నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: