టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలు ఈ తరంలో ఇద్దరు. ప్రధానంగా ఇద్దరి పేర్లు మనం మాట్లాడుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్. ఇద్దరూ కూడా టాలీవుడ్ లో ఇప్పుడు ఒక సంచలనం. నటన అయినా డాన్స్ అయినా సరే ఇద్దరూ కూడా ఇప్పుడు టాలీవుడ్ లో ఎవరికి అందని ఎత్తులో ఉన్నారు అనేది వాస్తవం. ప్రస్తుతం ఇద్దరూ కూడా టాలీవుడ్ లో ఒక భారీ సినిమాలో నటిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

అయితే ఈ సినిమా మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా అభిమానులను ఏదోక రూపంలో నిరాశ పరుస్తూనే ఉన్నారు అనేది వాస్తవం. ముఖ్యంగా ఈ సినిమా దర్శకుడు రాజమౌళి సినిమాను మరింత ఆలస్యం చేస్తున్నారు అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూడవచ్చు గాని రోది౦చకూడదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక ఫస్ట్ లుక్ ని విడుదల చేయడానికి రాజమౌళి అభిమానులకు చుక్కలు చూపిస్తున్నాడు అనేది వాస్తవం. 

 

అటు నందమూరి అభిమానులు ఇటు మెగా అభిమానులు ఇద్దరూ కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయినా సరే ఈ సినిమా గురించి మాత్రం జక్కన్న ఒక రేంజ్ లో వారి సహనాన్ని పరేక్శిస్థున్నాఉద్ అనేది అర్ధమవుతుంది. ఎదురు చూసి చూసి పిచ్చి ఎక్కేలా ఉందని కొందరు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం స్టార్ హీరోల్లో వీరి కి ఉన్న క్రేజ్ ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయినా సరే జక్కన్న కనీసం అర్ధం చేసుకోవడం లేదని ఇన్ని రోజులు సినిమాకు ఎదురు చూడాలి అంటే చిరాకు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: