టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ రేపు తన 36వ జన్మదినాన్ని జరుపుకోనున్న విషయం తెల్సిందే. కెరీర్ పరంగా ఒక్కో సినిమాతో మంచి సక్సెస్ లు అందుకుంటూ ముందుకు సాగుతున్న ఎన్టీఆర్, ప్రస్తుతం మెగా హీరో రామ్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ అనే భారీ ప్రతిష్టాత్మక సినిమాలో ఒక హీరోగా నటిస్తున్నారు. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రౌద్రం రణం రుధిరం పేరుతో ఎంతో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నారు. ఇక మొదట బాలరామాయణం సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన సినీ కెరీర్ ని ప్రారంభించిన యంగ్ టైగర్, ఆ తరువాత పెరిగి పెద్దయ్యాక నిన్ను చూడాలని సినిమా ద్వారా హీరోగా రంగ ప్రవేశం చేసారు. 

 

అనంతరం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా అప్పట్లో సూపర్ హిట్ కొట్టి రెండవ సినిమాతోనే నటుడిగా ఆయనకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఇక కెరీర్ పరంగా ఎన్టీఆర్ ఏడవ సినిమాగా వచ్చిన సింహాద్రి సినిమాకు కూడా రాజమౌళి దర్శకత్వం వహించారు. భూమిక, అంకిత హీరోయిన్లుగా నటించిన ఆ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ కొట్టి మాస్ లో ఎన్టీఆర్ కు విపరీతమైన క్రేజ్ ని, ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చిపెట్టింది. అయితే ఆ తరువాత వెంటనే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆంద్రవాలా సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటించడం జరిగింది. అప్పట్లో జరిగిన ఆ సినిమా ఆడియో రిలీజ్ వేడుకని ఇప్పటికీ కూడా సినీ ప్రేక్షకులు, ఎన్టీఆర్ అభిమానులు మరిచిపోలేరు అనే చెప్పాలి. 

 

అయితే ఎంతో క్రేజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఘోర పరాజయాన్ని అందుకుంది. ఫ్యాన్స్ ఆశలు నిరాశలు చేసిన ఆ సినిమా కనుక హిట్ కొట్టి ఉంటె, నిజంగా ఆ తరువాత ఎన్టీఆర్ ఆల్మోస్ట్ నెంబర్ వన్ హీరో అయిఉండేవారని సినీ విశ్లేషకులు చెప్పడం జరిగింది. అయితే అనూహ్యంగా ఫ్లాప్ అయిన ఆ సినిమా తరువాత వివి వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన సాంబ కూడా యావరేజ్ గా నిలిచింది. ఆ విధంగా ఆంధ్రావాలా సినిమా ఫ్లాప్ అయి ఎన్టీఆర్ అప్పట్లో నెంబర్ వన్ అయ్యే స్థానాన్ని కొంత దెబ్బతీసిందని చెప్పాలి. కాగా ఆ తరువాత కొన్నేళ్ల గ్యాప్ అనంతరం పూరి తో మరొక్కసారి ఎన్టీఆర్ నటించిన టెంపెర్ సినిమా సూపర్ హిట్ కొట్టి వారి కాంబోలో మంచి సక్సెస్ ని నమోదు చేసింది....!! 

 

మరింత సమాచారం తెలుసుకోండి: