దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విపరీతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో కేంద్రం వరుసగా నాలుగో సారి లాక్ డౌన్ ను కొనసాగించింది. అయితే ఈసారి మరికొన్ని సడలింపు లతో మే 18 నుండి 31 వరకు కొనసాగనుంది. ఇకపోతే దాదాపు రెండు నెలల నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినిమా షూటింగ్ లు మరియు రిలీజ్ లు ఆగిపోయిన విషయం తెలిసిందే. థియేటర్లు అన్నీ మూత పడిపోయాయి. ఇక ఇప్పట్లో థియేటర్లలో సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం లేదు. అంతే కాకుండా కొన్ని వందల కోట్లు చిత్రపరిశ్రమ కరోనా వల్ల నష్టపోయింది.

 

ఇకపోతే షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు బోలెడు. ఆయా నిర్మాతలకు అయితే ఇది ఒక చావుదెబ్బ అనే చెప్పాలి. ఆర్థికంగా భారీ నష్టాన్ని చవి చూసిన వారు సమ్మర్ స్పెషల్ గా విడుదల చేద్దామనుకున్న సినిమాలు ఏవీ థియేటర్లకు నోచుకోకపోవడంతో ఏమిచేయాలో అర్థంకాని పరిస్థితి. ప్రతి వేసవి ఫ్యామిలీ మరియు కుర్రాళ్ళతో కలకలలాడే మల్టీప్లెక్స్ మరియు సింగిల్ థియేటర్స్ ఇప్పుడు బోసిపోయాయి.చిత్ర పరిశ్రమ కూడా ఇప్పట్లో కోలుకునే స్థితిలో లేదు.

 

ఇక మరోవైపు లాక్ డౌన్ వల్ల ప్రజలంతా ఇంట్లో ఓటిటి ప్లాట్ఫామ్స్ కి బాగా అలవాటు పడ్డారు. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, సన్ నెక్స్ట్ వంటి యాప్స్ లో సబ్ స్క్రైబ్ అయ్యి మంచి క్రేజీ కంటెంట్ ను, కొత్త కొత్త సినిమాలు చూసేస్తున్నారు. దీనితో చిన్న సినిమాలు దగ్గర నుండి భారీ బడ్జెట్ సినిమాల వరకూ ఓటిటి లో రిలీజ్ చేయడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

 

ప్లాట్ ఫార్మ్ ఓనర్స్ కూడా మంచి ధరకే సినిమాలను కొనేసి థియేటర్లలో విడుదల కాని సినిమాలను తమ వెబ్ సైట్ లో ఉంచి అధిక లాభాలు పొందాలని చూస్తున్నారు. చిన్న సినిమాల నిర్మాతలు అయితే ఒక మోస్తరు లాభం వచ్చినా పర్లేదు థియేటర్లో పరిస్థితుల్లో విడుదలైతే సినిమా ఆడుతుంది అని గ్యారెంటీ కూడా లేని పక్షంలో కనీస లాభానికి వారి చిత్రాలను అమ్మేస్తున్నారు.

 

ఇలా ప్రస్తుతం ఏడు సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. ఇందులో తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం సినిమాలు రెడీగా ఉన్నాయి. వాటిలో కీర్తి సురేష్ నటించినపెంగ్విన్‌’ (తెలుగు, హిందీ), అమితాబ్ బచన్గులాబో సితార’ (హిందీ), ‘శకుంతల దేవి’ (హిందీ), ‘లా’ (కన్నడ), ‘ఫ్రెంచ్‌ బిర్యానీ’ (కన్నడ), ‘పొన్‌మగళ్‌ వందన్‌’ (తమిళ్‌), ‘సుఫియం సుజాతాయాం’ (మలయాళం) సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. ఇక కోన వెంకట్ లాంటి నిర్మాతలు తమ సినిమాలని ఎంత ఆలస్యం అయినా థియోటర్స్ లోనే రిలీజ్ చేస్తామని తేల్చి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: