విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తరరకరామారావు అనే పేరుని కేవలం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు సైతం ఎప్పటికీ మరిచిపోలేరు అనే చెప్పాలి. ఇక ఆయన మనవడిగా చిన్నతనంలోనే బాల రామాయణం సినిమాతో టాలీవుడ్ కి బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్, ఆపై పెరిగి పెద్దయ్యాక నిన్ను చూడాలని సినిమా ద్వారా హీరోగా మారడం జరిగింది. అనంతరం అక్కడి నుండి ఒక్కో సినిమాతో మంచి సక్సెస్ లు అందుకుంటూ నటుడిగా పలు ఉన్నత స్థానాలు అధిరోహించడంతో పాటు ఎందరో అభిమానులను సైతం సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. 

 

ఇక మొదటి నుండి ఎక్కువగా మాస్ సినిమాలు చేస్తూ వస్తున్న ఎన్టీఆర్ కు చాలా వరకు తాతయ్య సీనియర్ ఎన్టీఆర్ మాదిరిగా ఆకట్టుకునే రూపంతో పాటు గంభీరమైన మంచి కంఠం మరొక వరంగా చెప్పుకోవాలి. ఒకరకంగా అవే ఎన్టీఆర్ కు మంచి నటుడి స్థాయిని తెచ్చిపెట్టడం జరిగింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆయనను చూడాలని, అలానే ఆయన నోటి వెంట పలికే పలు పవర్ఫుల్ డైలాగులు వినాలని ఎందరో ప్రేక్షకులతో పాటు అభిమానులు సైతం ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. ఇకపోతే కేవలం ఇవి మాత్రమే కాక, ఎన్టీఆర్ చిన్నప్పుడే కూచిపూడి నాట్యంలో మంచి ప్రవేశం కలిగి ఉండడంతో, సినిమాల్లో ఎటువంటి డాన్స్ స్టెప్స్ అయినా సరే ఎన్టీఆర్ ఇట్టే ఎంతో తేలికగా వేసేస్తూ ఉండడం గమనించవచ్చు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆకట్టుకునే మంచి నటనతో పాటు అదిరిపోయే మంచి డాన్సింగ్ టాలెంట్ కలిగిన ఎన్టీఆర్ కు విపరీతమైన క్రేజ్ నెలకొని ఉంది. 

 

ఇక ప్రతి సినిమాలోనూ నటన, డ్యాన్స్ లలో తన పరిణితిని పెంచుకుంటూ, అలానే తన సినిమాల వరుస సక్సెస్ లతో మార్కెట్ ఇమేజ్ ని కూడా అమాంతం పెంచుకుంటున్న ఎన్టీఆర్, ఇటీవల వరుసగా విజయాలతో ముందుకు సాగుతున్నారు. మూడేళ్ళ క్రితం వచ్చిన జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ పోషించిన రవాణ పాత్రకు అందరి నుండి విపరీతమైన ప్రశంశలు దక్కిన విషయం తెలిసిందే. ఇక మొత్తంగా తాతయ్య రూపం, అద్బుతంగా చెప్పే డైలాగ్ డెలివరీ తో పాటు అలరించే డ్యాన్స్ లు వంటి పలు అంశాలు ఎన్టీఆర్ ని తాతకు తగ్గ మనవడిని చేసాయి అని చెప్పవచ్చు.....!!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: