ముందుగా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాలరామాయణం సినిమా ద్వారా బాల నటుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్, ఆ సినిమాలోనే తన ఆకట్టుకునే నటనతో ప్రేక్షకులను అలరించి మంచి పేరు దక్కించుకోవడం జరిగింది. ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకుని నటన, డ్యాన్స్, ఫైట్స్ వంటి తదితర ఇతర అంశాల్లో శిక్షణ తీసుకున్న ఎన్టీఆర్, ఆపై కొన్నాళ్ల తరువాత ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై వచ్చిన నిన్ను చూడాలని సినిమా ద్వారా హీరోగా పరిచయం అవడం జరిగింది. అనంతరం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన రెండవ సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ అద్భుత విజయాన్ని అందుకుని ఆయనకు విపరీతమైన క్రేజ్ ని తెచ్చిపెట్టింది. అనంతరం వచ్చిన ఆది, సింహాద్రి సినిమాల విజయాలు ఎన్టీఆర్ కు తిరుగు లేని మాస్ హీరోగా మరింత గొప్ప పేరు తెచ్చిపెట్టడం జరిగింది. 

IHG's first look from 'RRR' won't release on his birthday, but ...

ఆ విధంగా ఒక్కో సినిమాతో వరుసగా ఒక్కో విజయం అందుకుంటూ ప్రేక్షకులను అభిమానులను అలరిస్తూ ముందుకు సాగుతున్న ఎన్టీఆర్, ఇటీవల తన నటన, డ్యాన్స్ లలో మరింతగా పరిణితి కనబరుస్తూ అందరి నుండి మంచి ప్రశంశలు అందుకుంటున్నారు. ఇక ప్రస్తుతం దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అతి పెద్ద మల్టి స్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ లో మరొక హీరో రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఎన్టీఆర్, ఆ సినిమాలో కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. ఇక మరొక రెండు రోజుల్లో ఆ సినిమా నుండి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్ అవుతుందని అభిమానులు భావించినప్పటికీ, ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ వలన లాక్ డౌన్ కొనసాగుతుండడంతో ఫస్ట్ లుక్ ని ఇప్పుడు రిలీజ్ చేయలేము అని సినిమా యూనిట్ ఒక ప్రకటన చేసింది. 

 

అయితే ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కొంత వ్యాప్తి చెందిన ఎన్టీఆర్ ఇమేజ్, రాబోయే రోజుల్లో ఆర్ఆర్ఆర్ రిలీజ్ తరువాత మరింతగా విస్తరించడం ఖాయం అని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇప్పటికే రాజమౌళి తీసిన బాహుబలి రెండు భాగాలూ ఎంత గొప్ప విజయాలు అందుకున్నాయో మనకు తెలిసిందే. కాగా వాటిని మించే విధంగా ప్రస్తతం ఎంతో భారీ ఖర్చుతో రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీస్తున్నారని, అందుతున్న సమాచారం ప్రకారం ఈ కూడా ఊహించనంత పెద్ద విజయాన్ని సాధించడం ఖాయం అని అంటున్నారు. ఒకవేళ అన్ని కలిసి వచ్చి అదే జరిగితే, ఎన్టీఆర్ ఇమేజ్ రేంజ్ ఊహించని విధంగా మరింతగా గొప్ప స్థాయికి పెరిగి, ఆయన కెరీర్ కూడా మరింతగా దూసుకెళ్ళడం ఖాయం అనే చెప్పాలి....!!!

మరింత సమాచారం తెలుసుకోండి: