హీరోయిన్లు ఎపుడూ రెండు, మూడు ఆప్షన్స్ రెడీగా పెట్టుకుంటారు. ఒకచోట అటూఇటూ అయినా.. మరోచోట నిలబడొచ్చనే ప్లాన్స్ లో ఉంటారు. ఇప్పుడు టాలీవుడ్ జిగేల్ రాణి కూడా ఇలాగే కోలీవుడ్ పై ఫోకస్ పెడుతోంది. తమిళనాట సూపర్ హీరోయిన్ అనిపించుకునేందుకు ప్రయత్నిస్తోంది. 

 

పూజా హెగ్డే కెరీర్ బిగినింగ్ నుంచే మార్కెట్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఓ వైపు తెలుగు సినిమాల్లో నటిస్తూనే బాలీవుడ్ ప్రాజెక్ట్స్ నీ ఫోకస్ చేస్తోంది. తెలుగులో ముకుంద చేయగానే హిందీకి వెళ్లిపోయింది. అక్కడ హృతిక్ రోషన్ తో కలిసి మొహంజదారో సినిమా చేసింది. ఈ ప్రాజెక్ట్ కోసం కొన్నాళ్లు టాలీవుడ్ కు కూడా బ్రేక్ ఇచ్చింది. 

 

మొహంజదారో మిస్ ఫైర్ అవడంతో పూజాహెగ్డే మళ్లీ టాలీవుడ్ కు వచ్చేసింది. డీజేలో అందాల మోత మోగించి, భారీ అవకాశాలు అందుకుంది. టాలీవుడ్ టాప్ ఛైర్ కు దగ్గరయింది. అయితే ఈ స్టార్ డమ్ ని తమిళ్ కి విస్తరించాలనుకుంటోంది పూజా. కోలీవుడ్ లో ఓ సూపర్ హిట్ ఇచ్చే కథ కోసం సంప్రదింపులు జరుపుతోంది. 

 

విజయ్-మురుగదాస్ కాంబినేషన్ లో తుపాకి 2రాబోతోంది. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ తో పాటు పూజాని హీరోయిన్ గా తీసుకుంటారనే ప్రచారం జరిగింది. కానీ పూజా హెగ్డే నుంచి ఎలాంటి క్లారిఫికేషన్ లేదు. అయితే పూజా తమిళ సినిమాతోనే కెరీర్ స్టార్ట్ చేసింది.

 

తమిళ్ లో ముగమూది సినిమాతో కెమెరా ముందుకొచ్చింది పూజా హెగ్డే. ఇప్పుడు హీరోయిన్ గా అవకాశం ఇచ్చిన కోలీవుడ్ లో క్వీన్ గా ఎదగాలనుకుంటోంది. మొత్తానికి పూజా హెగ్డే తమిళనాట కన్నేసింది. ఎలాగైనా అక్కడ తన టాలెంట్ చూపించి తమిళ ప్రజల మనసు దోచుకోవాలని ఆరాటపడుతోంది. అందుకే తన టాలెంట్ ఏంటో చూపిస్తోంది. చూడాలి మరి ఆ బ్యూటీ ప్రతిభ ఏమాత్రం వర్కవుట్ అవుతుందో.. 

మరింత సమాచారం తెలుసుకోండి: