యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ మొదలుపెట్టి బాల రామాయణం సినిమాలో రాముడిగా నటించి మెప్పించారు. ఎన్టీఆర్ పూర్తి స్థాయి హీరోగా 2001 సంవత్సరంలో విడుదలైన నిన్ను చూడాలని చిత్రం ద్వారా తెరంగేట్రం చేశారు. ఈ సినిమాకు విఆర్ ప్రతాప్ దర్శకత్వం వహించగా రామోజీరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు రామోజీరావు ఎన్టీఆర్ కు 4 లక్షల రూపాయలు పారితోషికంగా అందుకున్నారు. 


 
అనంతరం ఆ డబ్బులను ఎక్కడ దాచిపెట్టాలో తెలియక ఇబ్బంది పడ్డారు. ఇప్పట్లో 4 లక్షలు తక్కువ మొత్తమే కానీ 2001లో 4 లక్షల రూపాయల పారితోషికం అంటే సాధారణ విషయం కాదు. అప్పుడు ఎన్టీఆర్ వయస్సు 18 సంవత్సరాలు. ఆ వయస్సులో అంత డబ్బు ఏం చేయాలో అర్థం కాక ఎన్టీఆర్ మొదట ఇంట్లో ఒక రహస్య ప్రదేశంలో దాచిపెట్టాడు. ఆ తరువాత ఎన్టీఆర్ కు ఎందుకో ఆ ప్లేస్ సేఫ్ కాదనిపించింది. 
 


ఆ తరువాత కవర్ లో ఉన్న డబ్బులను ఎన్టీఆర్ బాత్రూమ్ లో దాచాడు. ఆ తరువాత ఎన్టీఆర్ కు అక్కడ కూడా సేఫ్ కాదనిపించడంతో కార్ డాష్ బోర్డులో డబ్బులు పెట్టి... కారు డ్రైవర్ డబ్బులు తీసుకునే అవకాశం ఉందని భావించి అక్కడి నుంచి కూడా ఎన్టీఆర్ డబ్బు తీసేశాడు. చివరికి ఆ డబ్బును ఏం చేయాలో అర్థం కాక ఎన్టీఆర్ తన తల్లికి ఆ డబ్బులను గిఫ్ట్ గా ఇచ్చాడు. ఒక ఇంటర్వూలో ఈ విషయాలను స్వయంగా ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. 
 


4 లక్షల రూపాయల పారితోషికంతో హీరోగా కెరీర్ మొదలుపెట్టిన ఎన్టీఆర్ ప్రస్తుతం 30 కోట్ల రూపాయలు పారితోషికం అందుకుంటున్నారు. బృందావనం తరువాత కొంతకాలం ఫ్లాపులతో సతమతమైన ఎన్టీఆర్ టెంపర్ సినిమా నుంచి వరుస విజయాలను అందుకుంటూ సినిమా సినిమాకు మార్కెట్ పరిధిని పెంచుకుంటున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో కలిసి నటిస్తున్నారు. 2021 జనవరి 8వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: