తెలుగు సినిమా హీరోల్లో ప్రస్తుత జనరేషన్ లో ఎన్టీఆర్రామ్ చరణ్ స్నేహం ఆకట్టుకుంటూ ఉంటుంది. సినిమాల పరంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో వీరిద్దరివి పెద్ద కుటుంబాలు అని తెలిసిన విషయమే. దశాబ్దాల నుంచి ఇద్దరి కుటుంబాల ఫ్యాన్స్ మధ్య వైరుధ్యాన్ని ఈ ఇద్దరు యువ హీరోలు తమ స్నేహంతో చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘తామంతా కలిసి ఉంటున్నాం.. అభిమానులు కూడా సోదరుల్లా కలిసి ఉండాలి’ అని ఎన్టీఆర్ పలు సందర్భాల్లో చెప్తూనే ఉంటాడు.

IHG

 

రామ్ చరణ్ తో వ్యక్తిగతంగా ఎంతో ఆత్మీయతను చూపిస్తూ ఉంటాడు ఎన్టీఆర్. దీపావళితో సహా పలు పండుగలను రామ్ చరణ్ ఇంట్లోనే జరుపుకున్నాడనే విషయాలు కూడా తెలిసిందే. ఎన్టీఆర్ బాద్ షా సినిమా షూటింగ్ ఓపెనింగ్ కు రామ్ చరణ్ క్లాప్ కొట్టాడు. తర్వాత వీరిద్దరూ ఒకే కారులో వెళ్లారు. అప్పటినుంచీ వీరిద్దరి స్నేహం వార్తలో నిలిచింది. తామిద్దరం ఎంతో ఆత్మీయంగా ఉంటామని ఎన్టీఆర్ చాలా సందర్భాల్లో చెప్పాడు. ఆమధ్య ఎన్టీఆర్ ఇంటికి రామ్ చరణ్ వెళ్లిన సందర్భంలో సీనియర్ ఎన్టీఆర్ చిత్రపటం వద్ద రామ్ చరణ్ అదే స్టైల్లో కూర్చున్న ఫొటోను ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అప్పట్లో ఆ పిక్ బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. 

IHG's 'Friendship Day' message for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=RRR MOVIE' target='_blank' title='rrr-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>rrr</a> co-star <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CHARAN' target='_blank' title='ram charan-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ram charan</a> ...

 

మహేశ్ తో కూడా ఎన్టీఆర్ స్నేహంగా ఉంటాడన్న విషయం తెలిసిందే. వీరంతా కొన్ని వెకేషన్స్ ను కుటుంబాలతో జరుపుకోవడం తెలిసిందే. ఇందుకు సంబంధించిన పలు ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. భరత్ అను నేను సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ కు ఎన్టీఆర్ గెస్ట్ గా వెళ్లాడు. తర్వాత వీరు ముగ్గురూ కలిసి ఓ పార్టీలో కూడా పాల్గొన్నారు. వీరు ముగ్గురి స్నేహంతో ఫ్యాన్స్ మధ్య కూడా స్నేహ భావం పెరిగేందుకు దోహదపడుతుందని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: