సాధారణంగా స్టార్ హీరోల కుటుంబం నుంచి ఎవరు అయినా వస్తే చాలు వాళ్ళు ఇక నటన అవసరం లేకపోయినా డాన్స్ అవసరం లేకపోయినా సరే వాళ్లకు తిరుగు ఉండదు వాళ్ళు ఏ విధంగా చేసినా సరే సినిమాలో వాళ్లకు ప్రాధాన్యత ఉంటుంది వాళ్ళను ఏ దర్శకుడు అయినా నిర్మాత అయినా సరే తీసుకుంటారు అనే ఆలోచనలు ఉంటాయి. కాని టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మాత్రం అలా లేదు. తనలో ఉన్న నటుడ్ని అతను అనేక సందర్భాల్లో బాహ్య ప్రపంచానికి పరిచయం చేసాడు. సినిమాలో హీరో అంటే నటించాలి అది ఎవరు అయినా సరే అనే విధంగా అతను ఆకట్టుకున్నాడు.

 

చాలా మంది హీరోల కుమారులు వాళ్లకు ఎదీ రాకపోయినా సరే స్టార్ హీరో హోదా తో టాలీవుడ్ లో నేడు నిలబడ్డారు. కాని తారక్ మాత్రం తన సొంత ప్రతిభ తో అభిమానులను సంపాదించుకున్నాడు. సినిమా ఏది అయినా సరే తన నటన తోనే తారక్ పైకి వచ్చాడు అనేది వాస్తవం. మొదటి నుంచి కూడా అతను ఇదే విధంగా ఉన్నాడు. సినిమాకు హీరో న్యాయం చేసినప్పుడే సినిమా అందంగా ఉంటుంది అని నమ్మే హీరో జూనియర్  ఎన్టీఆర్ అని పలు సందర్భాల్లో దర్శక నిర్మాతలు వ్యాఖ్యలు కూడా చేస్తూ వచ్చారు తన సినిమాకు తాను ప్రతీ సందర్భం లో కూడా న్యాయం చేసాడు అనేది వాస్తవం. 

 

అందుకే దర్శక నిర్మాతలు అతని తో సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించారు. ప్రస్తుతం తారక్ ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాలో అతను కొమరం భీమ్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ని వాయిదా వేసింది చిత్ర యూనిట్.

మరింత సమాచారం తెలుసుకోండి: