టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా మారే క్రమంలో అతను పడిన కష్టాల గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. కుటుంబం పెద్దది అయినా సరే అతనికి కుటుంబం నుంచి వచ్చిన మద్దతు చాలా తక్కువ అని అంటూ ఉంటారు అతని గురించి బాగా తెలిసిన వాళ్ళు. అతను సినిమాలు చెయ్యాలి అనుకున్న సమయంలో అతనికి ఎవరి నుంచి కూడా సరైన మద్దతు రాలేదు అని అంటున్నారు. టాలీవుడ్ లో ఏ హీరోకి లేని విధంగా అతను కష్టాలు పడ్డాడు అని అతనిని ముందు కొందరు సినిమాల్లోకి అసలు వద్దని చెప్పిన రోజులు కూడా ఉన్నాయని అంటారు. 

 

అయినా సరే అతను ఏ విధంగా కూడా వెనకడుగు వేయలేదు అతని తల్లి నుంచి వచ్చిన మద్దతు ద్వారా అతను ఈ స్థాయిలో ఉన్నాడు అని చెప్తూ ఉంటారు. తారక్ లో ఉన్న ప్రతిభ ను అతని తల్లి గుర్తించి అతన్ని ఈ స్థాయిలో నిలబెట్టారు అని అంటూ ఉంటారు. అతని గురించి ఆమెకు బాగా తెలుసు అని అందుకే తారక్ ని ఈ విధంగా ఆమె ముందుకు తీసుకుని వచ్చారు అని ఎవరి మద్దతు ఉన్నా లేకపోయినా సరే తారక్ ని మాత్రం ఆమె ఏ స్థాయిలో చూడాలి అనుకున్నారో అదే స్థాయిలో చూసారు అని అంటూ ఉంటారు. 

 

ఆమె అతని కోసం చాలా కష్టపడిన సందర్భాలు ఉన్నాయని చాలా మంది ఆమెను వేధించారు అని అయినా సరే ఆమె మాత్రం ఎక్కడా కూడా భయపడకుండా తారక్ ని నేడు ఈ స్థాయికి తీసుకుని వచ్చారు అని అంటూ ఉంటారు. ఆమె అతని కోసం చాలా కష్టపడ్డారు అని ఇప్పటికి చెప్తూ ఉంటారు. ఆమె ను చాలా మంది వేదించినా సరే కొడుకుని ఈ స్థాయిలో నిలబెట్టారు ని చెప్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: