సాధారణంగా ఒక హీరోకి ప్రేమ వ్యవహారం ఉంది అంటే చాలు అతనిని ఎవరు కూడా అడ్డుకునే పరిస్థితి ఉండదు. ఎక్కడ అయినా సరే మనం దీనిని చూస్తూనే ఉంటాం. ఏ హీరో అయినా సరే ఒకసారి ప్రేమలో పడితే అతనిని కన్న వాళ్ళు కూడా అడ్డు చెప్పే పరిస్థితి దాదాపుగా ఎక్కడ కూడా ఉండదు అనేది మనం వినే మాట. ఏ హీరో అయినా సరే ఇదే విధంగా ఉంటాడు అని బాలీవుడ్ లో చూసాం టాలీవుడ్ లో చూసాం. వాళ్లకు ఎదురు చెప్పే పరిస్థితి దాదాపుగా కూడా ఉండదు అనేది వాస్తవం. అయితే టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మాత్రం ఇలా లేదు. 

 

అతను సమీరా రెడ్డి ని వివాహం చేసుకోవాలి అని భావించాడు. ఆమె కు ఇదే విషయాన్ని చెప్పాడు ఆమె కూడా ఓకే చెప్పింది. అయితే కుటుంబ సభ్యుల విషయంలో మాత్రం దీనికి చాలా వరకు నో అనే సమాధానమే వచ్చింది అని అంటూ ఉంటారు టాలీవుడ్ జనాలు. వాళ్ళు అసలు వద్దు అని చెప్పారు అని సమాచారం. వాళ్ళు వద్దు అనడం తో అతను వాళ్లకు అసలు ఎదురు చెప్పలేదు తన ప్రేమను చంపుకుని సైలెంట్ గా ఉన్నాడు అని అంటూ ఉంటారు. అతనికి తండ్రి చెప్పిన విధానం తల్లి చెప్పిన విధానం నచ్చి వెనక్కు తగ్గాడు అనేది టాలీవుడ్ జనాల మాట. 

 

అందుకే ఆమె మీద ఎంత ఇష్టం ఉన్నా సరే అతను ఎప్పుడు కూడా బయటపెట్టుకుని అల్లరి చేసుకోలేదు అని అంటూ ఉంటాడు. అతనికి కుటుంబం ముందు నుంచి కూడా ప్రాధాన్యత ఇవ్వడానికి అదే కారణం అని అంటూ ఉంటారు టాలీవుడ్ జనాలు. అతను తర్వాత కుటుంబ చెప్పిన పెళ్ళే చేసుకుని లైఫ్ లో సెటి ల్ అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: