తెలుగు జాతీ ఖ్యాతీని విశ్యవిఖ్యాతం చేసిన నవరస నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు. వెండితెర మీద ఆయన పోషించని పాత్ర లేదు. ఆయన నట వారసుడిగా వెండితెరకు పరిచయం అయిన నటుడు నందమూరి బాలకృష్ణ. తండ్రి వారసత్వంతో పాటు ఇమేజ్‌ను కూడా తన భుజానికెత్తుకున్న బాలకృష్ణ హీరోగా టాప్ పోజీషన్‌ను అందుకున్నాడు. కానీ ఎన్టీఆర్ స్థాయి అని మాత్రం అనిపించుకోలేకపోయాడు. అదే ఫ్యామిలీ నుంచి వచ్చిన ఎన్టీఆర్‌ ప్రస్తుతం అగ్రకథానాయకుడిగా కొనసాగుతున్నాడు. రూపు రేఖల్లోనే కాదు నటనలోనూ తాతకు తగ్గ మనవడు అనిపించుకుంటున్నాడు.

 

ఈ నేపథ్యంలోనే ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్‌ను రూపొందించాడు నందమూరి బాలకృష్ణ. తండ్రి నటవారసత్వాన్ని కొనసాగిస్తున్న బాలయ్య తండ్రి పాత్రలో మెప్పించే ప్రయత్నం చేశాడు. కానీ బాలయ్య ప్రయత్నం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. ఎన్టీఆర్ జీవిత కథను రెండు భాగాలుగా తెరకెక్కించగా రెండు పార్టులు ఫ్లాప్‌ అయ్యాయి. అంతేకాదు ఎన్టీఆర్‌ పాత్రలో బాలయ్య లుక్ పై కూడా విమర్శలు వినిపించాయి. యంగ్ ఎన్టీఆర్‌ లుక్‌ లో బాలయ్యను చూసి అభిమానులు కూడా పెదవి విరిచారు. ఎన్టీఆర్ బయోపిక్‌ ఫ్లాప్ అవ్వటం వెనక ఇది కూడా ఒక కారణం.

 

అయితే ఆ బయోపిక్ లో ఎన్టీఆర్ నటించి ఉంటే అన్న ప్రశ్న తలెత్తింది. నటుడిగా ఎంతో ఎదిగిన ఎన్టీఆర్ తాత పాత్రకు మరింతగా న్యాయం చేయగలడని భావిస్తున్నారు అభిమానులు. అందుకు తెర మీద తాత పాత్రలో ఎన్టీఆర్‌ ను చూసేందుకు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ బయోపిక్‌ లో జూనియర్ నటించి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదని భావిస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ పోలికలు పుష్కలంగా ఉన్న తారక్ , యంగ్‌ ఎన్టీఆర్‌ లుక్‌లో ఔరా అనిపించేవాడన్నది ఫ్యాన్స వాదన. అందుకే మహానటి సినిమా సమయంలోనూ ఎన్టీఆర్ పాత్రకు జూనియర్‌నే సంప్రదించారు. కానీ తారక్‌ మాత్రం తాత పాత్రలో నటించనని చెప్పి ఆ ప్రాజెక్ట్‌లకు నో చెప్పాడు. మరి భవిష్యత్తులోనే ఎన్టీఆర్ బయోపిక్‌లో ఎన్టీఆర్‌ను చూసే అవకాశం ఉందేమో అని చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: