కంటెయిన్మెంట్ ప్రాంతాలు మినహా తెలంగాణ రాష్ట్రం అంతా గ్రీన్ జోన్ గా మారిపోయినా అల్లు అర్జున్ కష్టాలు మాత్రం ఇప్పట్లో తీరే పరిస్థితులు కనిపించడం లేదు. సెలూన్స్ అన్నీ తిరిగి ఓపెన్ అవుతున్న పరిస్థితులలో ఇప్పటి వరకు గెడ్డాలు మీసాలు పెరిగిన ఎందరికో కరోనా మోక్షం ప్రసాదిస్తోంది. అయితే పరిస్థితులు మారినా బన్నీ పరిస్థితి మాత్రం ఇప్పటికీ అయోమయం అని జోక్ చేస్తున్నారు.

 

‘పుష్ప’ సినిమా కోసం అల్లు అర్జున్ డిఫరెంట్ గెటప్ లో కనిపించడానికి గుబురు గెడ్డం జుత్తు విపరీతంగా పెంచిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ లాక్ డౌన్ పరిస్థితులు లేకుండా ఉండి ఉంటే ఈ పాటికే గుబురు గెడ్డం తో ఉన్న బన్నీ లుక్ కు సంబంధించిన లారీ డ్రైవర్ పాత్రకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేసి బన్నీ గెడ్డం లుక్ కు మోక్షం కలిగించాలని సుకుమార్ కొన్ని నెలల క్రితమే భావించాడు. 


అయితే కరోనా తో పరిస్థితులు మారిపోవడంతో ‘పుష్ప’ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో బన్నీకే తెలియని పరిస్థితి. ‘పుష్ప’ మూవీని పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్న పరిస్థితులలో సహజత్వం కోసం అల్లు అర్జున్ తనకు పెరిగిపోయిన గుబురు గెడ్డం గురించి పట్టించుకోకుండా ప్రతిరోజు దర్శకుడు సుకుమార్ తో తన చిత్తూరు యాసలో తన డైలాగ్స్ ను ఒకటికి పది సార్లు చెపుతూ ప్రాక్టీస్ చేయడమే కాకుండా ప్రస్తుతం చిత్తూరు యాస సొగసును ఈ లాక్ డౌన్ పిరియడ్ లో అల్లు అర్జున్ తెలుసుకుంటున్నాడు.


ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ తో అందరు చక్కగా హీరోలుగా తయారవుతున్నా తనను మాత్రం కరోనా తో పాటుగా గుబురు గెడ్డం జుత్తు తో సహజీవనం చేసే స్థాయికి తీసుకు వచ్చావు అంటూ బన్నీ సుకుమార్ తో జోక్ చేసినట్లు టాక్. అయితే హీరోలను తాను ఊహించుకున్న పాత్రల రూపంలో పరకాయ ప్రవేశం చేయడానికి విపరీతంగా టార్చర్ పెట్టే సుకుమార్ బన్నీ కష్టాలను వినిపించుకునే రీతిలో లేడు..

మరింత సమాచారం తెలుసుకోండి: