150 కోట్ల కలక్షన్స్ వర్షం కురిపించిన ‘అల వైకుంఠపురములో’ మూవీ తరువాత త్రివిక్రమ్ ఖ్యాతిజాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఈ పరిస్థితులలో త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి ఎందరో క్యూ కట్టినా త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ కు ఇచ్చిన మాటకు కట్టుబడి తన మూవీని జూనియర్ తో ఖరార్ చేసుకుని తన మాటను నిలబెట్టుకున్నాడు.


వాస్తవానికి కరోనా సమస్యలు రాకుండా ఉండి ఉంటే త్రివిక్రమ్ జూనియర్మూవీ ఈ మే నెలలో అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించాలని త్రివిక్రమ్ భావించాడు అని అంటారు. అయితే కరోనా దెబ్బతో అంచనాలు తారుమారు కావడంతో ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాది చివరకు ప్రారంభం అవ్వడం కూడ కష్టమే అన్న అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. 


ఇలాంటి పరిస్థితులలో త్రివిక్రమ్ వెంకటేష్ తో ఒక మూవీ చేస్తాడని కొందరు ఒక మీడియం రేంజ్ హీరోతో ఒక సినిమాను ఈ గ్యాప్ లో తీస్తాడు అంటూ మరికొందరు వార్తలు పుట్టించారు. అయితే త్రివిక్రమ్ అసలు పరిస్థితి వేరు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గాసిప్పులు గుప్పుమంటున్నాయి. 


హడావిడి చేస్తున్న ఈ వార్తల ప్రకారం ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో ఖాళీగా ఉన్న త్రివిక్రమ్ కొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు కొత్త దర్శకులతో లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత ప్రారంభించే సినిమాలకు సంబంధించి కథలను వింటూ ఆ కథలకు తనదైన స్టైల్ లో సూచనలు ఇస్తూ ఆ కథల పై తన మార్క్ ఉండేలా కొందరు ప్రముఖ నిర్మాతలకు సినిమాల స్క్రిప్ట్ విషయంలో త్రివిక్రమ్ సహాయం చేస్తున్నట్లు టాక్. ఇలా సహాయ సహకారాలు అందించినందుకు త్రివిక్రమ్ కు ఆ భారీ నిర్మాణ సంస్థలు బాగానే బహుమతుల రూపంలో ముట్టచేపుతున్నారు అంటూ గాసిప్పులు హల్ చల్ చేస్తున్నాయి. ఈవార్తలు విన్న కొందరు లాక్ డౌన్ సమయాన్ని త్రివిక్రమ్ చాల తెలివిగా ఉపయోగించుకుంటున్నాడు అంటూ కొందరు జోక్ చేస్తున్నారు..    

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: