జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి... టాలీవుడ్ లో ఈ జోడీ గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. టాలీవుడ్ లో ఈ జోడి గురించి ఇప్పుడే కాదు ముందు నుంచి కూడా ఎవరో ఒకరు ఏదోక సందర్భంలో చెప్తూనే ఉంటారు. టాలీవుడ్ లో వీరి తర్వాతే ఎవరు అయినా కొందరు నిర్మాతలకు అనే వాళ్ళు కూడా ఉన్నారు. అగ్ర దర్శకుడి గా అగ్ర హీరో గా వీళ్ళ మధ్య ఉన్న స్నేహంలో ఎక్కడా కూడా హోదాలు లేవు అని ప్రతీ ఒక్కటి కూడా వాళ్ళ జీవితంలో ఒకరి తో ఒకరు ఓపెన్ అని అంటూ ఉంటారు. 

 

నిజం ఎంత అనేది పక్కన పెడితే వాళ్ళు ఎప్పుడు కూడా ఒకరికి ఒకరు విలువ ఇచ్చుకోవడం ఉంటుంది అని అంటారు. మన తెలుగులో తారక్ కి ఒక రేంజ్ లో డిమాండ్ ఉంది అనేది వాస్తవం. రాజమౌళి కి కూడా అదే స్థాయిలో ఉంది అనేది అందరికి తెలిసిన విషయమే. అయినా సరే ఎక్కడ కూడా వీళ్ళు పొగరు అనేది చూపించే అవకాశ౦ ఉండదు అని అంటారు టాలీవుడ్ జనాలు. ప్రస్తుతం తారక్ ఈ స్థాయిలో ఉన్నాడు అంటే రాజమౌళి తోనే సాధ్యం అయింది అని అలాగే జక్కన్న ఈ స్థాయిలో ఉన్నాడు అంటే కచ్చితంగా తారక్ తోనే సాధ్యం అయింది అని అంటూ ఉంటారు. మన తెలుగులో ఏ జోడి కి కూడా ఈ స్థాయిలో పాపులారిటి అనేది లేదు అనే మాట ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

 

ప్రతీ నిమిషం కూడా వీళ్ళు తమ స్థాయి ఏ స్థాయిలో ఉన్నా సరే డౌన్ టూ ఎర్త్ ఉంటారు అని అంటారు. ప్రస్తుతం వీరి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది. ఈ సినిమా కోసం తారక్ దాదాపుగా రెండు సినిమాలు వదులుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: