నందమూరి నట వారసుడిగా వెండితెరకు పరిచయం అయిన యువ కథానాయకుడు ఎన్టీఆర్‌. నిన్ను చూడాలని సినిమాతో వెండితెరకు పరిచయం అయిన జూనియర్‌ తరువాత ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు టాలీవుడ్‌ అగ్రకథానాయకుల లిస్ట్‌ లో చేరిపోయాడు. నందమూరి అనే భారీ బాధ్యతను భుజాన వేసుకొని వెండితెర మీద ప్రయాణం చేస్తున్న ఎన్టీఆర్ తన మీద ఉన్న అంచనాలకు మించి విజయాలు సాధించాడు. అయితే ఎన్టీఆర్‌లో ఈ జనరేషన్‌ హీరోలకు ఎవరికీ లేని మరో ప్రత్యేకత కూడా ఉంది.

 

ఎన్టీఆర్ ఎంతో గొప్ప డ్యాన్సరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  టాప్‌ డ్యాన్సర్లు అనిపించుకున్న హీరోయిన్లు కూడా ఎన్టీఆర్ పక్కన డ్యాన్స్ చేయాలంటే భయపడతారు. అంతేకాదు పలువురు బాలీవుడ్‌ స్టార్ హీరోలు కూడా ఎన్టీఆర్ డ్యాన్స్‌కు ఫిదా అయ్యారు. అయితే ఎన్టీఆర్‌ అంత గొప్ప డ్యానర్స్ అనిపించుకోవటం వెనుక చాలా కృషి ఉంది. జూనియర్ చిన్నతనం నుంచి క్లాసికల్‌ డ్యాన్స్ నేర్చుకున్నాడు. ప్రముఖ మాస్టర్ దగ్గర కూచిపూడిలో శిక్షణ తీసుకున్నాడు.
IHG

 

అంతేకాదు పలు వేదికల మీద కూచిపూడి నృత్య ప్రదర్శనలు కూడా ఇచ్చాడు జూనియర్‌. ఆ టాలెంట్‌ వల్లే ఎన్టీఆర్ బెస్ట్ డ్యాన్సర్ అనిపించుకోగలుగుతున్నాడట. ఈ జనరేషన్‌ హీరోల్లో క్లాసికల్‌ డ్యాన్స్‌లో ప్రవేశం ఉన్న నటుడు ఎన్టీఆర్‌ మాత్రమే అయితే తెర మీద ఎన్టీఆర్‌ క్లాసికల్‌ డ్యాన్సింగ్ స్కిల్స్ ను ఇంత వరకు చూపించలేదు. కంత్రి, స్టూడెంట్‌ నంబర్‌ 1 లాంటి ఒకటి రెండు సినిమాల్లో అక్కడక్కడా క్లాసిక్ డాన్స్ మూమెంట్స్ చూపించినా పూర్తి స్థాయిలో క్లాసికల్‌ డ్యాన్స్ చేసి సందర్భాలు లేదు. ఈ విషయంలో కూడా ఎన్టీఆర్ అభిమానుల్లో నిరాశ ఉంది. ఎన్టీఆర్ హీరోగా సాగరసంగమం లాంటి పూర్తి స్థాయి క్లాసికల్‌ డ్యాన్స్ బేస్ట్ సినిమా అయినా అది కుదరకపోతే ఏదైన సినిమాలో పూర్తి స్తాయి క్లాసికల్‌ డ్యాన్స్ అయినా చేయిస్తే చూడాలని ఎదురుచూస్తున్నారు తారక్‌ అభిమానులు.
IHG

మరింత సమాచారం తెలుసుకోండి: