సాధారణంగా ఒక స్టార్ హీరోకి రాజకీయంగా బ్యాక్ గ్రౌండ్ ఉంది అంటే అతనిని ఆపే దమ్ము ఎవరికి ఉండదు అనే విషయ౦ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఏ విధంగా అయినా సరే హీరో తన రాజకీయ పలుకుబడిని సినిమాలో వాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాని మన తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మాత్రం అలాంటి పరిస్థితి ఏ విధంగా కూడా ఉండదు అని అంటున్నారు. అతను ఎప్పుడు కూడా తన కుటుంబం రాజకీయాల్లో ఉన్నా సరే ఏ రోజు కూడా రాజకీయాల గురించి ప్రస్తావించిన సందర్భం అనేది లేదు అని అంటారు. 

 

ఏ స్థాయిలో కూడా అతను టీడీపీ ప్రభుత్వం ఉన్నా సరే వాడుకోవాలి అని అనుకోలేదు అని అంటారు. వాడుకుని పైకి రావాలి అని అతను ఎప్పుడు కూడా అనుకోలేదు అని అంటారు. దీని గురించి కూడా టాలీవుడ్ లో చర్చలు జరిగిన సందర్భాలు ఉన్నాయి అనేది తెలిసిందే. అతనిని రాజకీయాల్లోకి రావాలని ఎంత మంది అడిగినా సరే ఎప్పుడు కూడా అతను సినిమాలను దాటి వెళ్ళే ప్రయత్నం చేయలేదు అని అంటారు. అతను ప్రస్తుతం ఒక రేంజ్ లో ఉన్నాడు. అతనికి ఫాలోయింగ్ కూడా రాజకీయంగా బాగానే ఉంటుంది. కాని ఎక్కడ కూడా అతను మాత్రం ఆ విధంగా ప్రయత్నాలు చేయలేదు అని అంటారు 

 

ఎంత మంది పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్ళాలి అని సూచనలు చేసినా సరే అతను మాత్రం వెళ్ళడానికి ఎప్పుడు కూడా ఇష్టం చూపించలేదు అనేది వాస్తవం. ప్రస్తుతం అతను సినిమాల మీదనే దృష్టి పెట్టాడు. రాజకీయాలకు తన తో అవసర౦ లేదని భావిస్తూ ఉంటాడు. అందుకే రాజకీయాలకు దూరంగా ఉన్నాడు అని అంటారు టాలీవుడ్ జనాలు. అన్ని పార్టీల్లో అతనికి మంచి మిత్రులు ఉన్నా ఏ రోజు కూడా వాడుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: