డిజిటల్ వరల్డ్ లో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ హవా స్టార్ట్ అయింది. అందరూ ఈ ఓటీటీలలో వచ్చే వెబ్ కంటెంట్ చూడటానికే ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం మనకి ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఎక్కువగానే అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్‌, సన్ నెక్స్ట్, ఆల్ట్ బాలాజీ, జీ 5, ఎం ఎక్స్ ప్లేయర్, ఎరోస్, ఆహా.. ఇలా చాలా ఓటీటీ యాప్స్ సక్సెస్ అయ్యాయి. కరోనా లాక్ డౌన్ పుణ్యమా అంటూ ఇంకా ఓటీటీలకు బాగా డిమాండ్ పెరిగింది. ఇంటికే పరిమితమైన జనాలు ఓటీటీలలో వచ్చే ఒరిజినల్ సినిమాలను వెబ్ సిరీసులను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. వెబ్ సిరీస్ ల ట్రెండ్ నడుస్తుండటంతో స్టార్స్ అంతా ఇప్ప్పుడు వెబ్ సిరీస్ లపై దృష్టి పెడుతున్నారు. రాబోయే రోజుల్లో వెబ్ కంటెంట్ దే రాజ్యం కాబోతుందని భావిస్తున్న నటీనటులు దర్శక నిర్మాతలు ఆ వైపుగా అడుగులు వేస్తున్నారు. సినిమాలకు మించిన బడ్జెట్లు పెట్టడానికి ఓటీటీ సంస్థలు రెడీగా ఉన్నాయి. ఇప్పటికే మన టాలీవుడ్ నుండి హీరో హీరోయిన్స్ డైరెక్టర్లు వెబ్ సిరీస్ వైపు అడుగులు వేశారు. 

 

టాలీవుడ్ లో కూడా శ్రీకాంత్, సందీప్ కిషన్, నవదీప్, మంచు లక్ష్మీ, హెబ్బా పటేల్, ఇషా రెబ్బా లాంటి వారు ఇప్పటికే వెబ్ సిరీస్ లలో దర్శనమిచ్చారు. సమంత, ప్రియమణి లాంటి స్టార్ హీరోయిన్స్ హిందీ వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే క్రిష్, నందిని రెడ్డి, సంకల్ప్ రెడ్డి, తరుణ్ భాస్కర్ లాంటి డైరెక్టర్లు వెబ్ సిరీస్ లలో అడుగుపెట్టారు. ఇప్పుడు లేటెస్టుగా డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి రాబోయే రోజుల్లో ఓ బోల్డ్ వెబ్ సిరీస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పూరి జగన్నాథ్ లాక్ డౌన్ లో సమయంలో కూడా ఓ ఇంట్రస్టింగ్ స్క్రిప్ట్ రాస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లాక్ డౌన్ వ్యవధిలో పూరి వెబ్ సిరీస్ కోసం స్క్రిప్ట్ వర్క్ కూడా చేసాడట. 'ఇస్మార్ట్ శంక‌ర్' విజ‌యంతో మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చిన పూరీ ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో ప‌ని చేస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో 'ఫైటర్' అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు పూరీ. కరణ్ జోహార్ - చార్మీ నిర్మిస్తున్న ఈ సినిమా ఐదు భాషల్లో రిలీజ్ కానుంది. ఇస్మార్ట్ శంకర్ తో భారీ విజయాన్నే నమోదు చేసిన పూరి.. ఆ సక్సెస్ ఇచ్చిన కిక్ తో వరుసగా హిట్స్ కొడతాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: