నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అయిన ఎన్టీఆర్ కెరీర్‌ స్టార్టింగ్ నుంచి మాస్ ఇమేజ్‌ కోసం కష్టపడ్డాడు. నందమూరి అభిమానులను సాటిస్ఫై చేసేందుకు ఎన్టీఆర్‌ ఎక్కువగా మాస్ కమర్షియల్ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చాడూ. అయితే ఈ ప్రయత్నాలు చాలా వరుకు బెడిసి కొట్టాయి. ముఖ్యంగా ఓ దశలో ఎన్టీఆర్‌ కష్టాల్లో పడే స్థాయిలో వరుసగా ఫ్లాప్‌లు వెంటాడాయి. వరుసగా ఓకే తరహా సినిమాలు చేయటం ఎన్టీఆర్‌ను ఇబ్బందులో పడేశాయి.

 

ముఖ్యంగా 2010 తరువాత ఎన్టీఆర్ కెరీర్‌ పూర్తిగా గాడి తప్పింది. 2011లో వచ్చిన శక్తి సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌లలో ఒకటి. ఆ తరువాత స్టైలిష్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఊసరవెల్లి కూడా భారీ ఫ్లాప్ అయ్యింది. ఆ తరువాత భారీ అంచనాల మధ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన దమ్ము సినిమా కూడా నిరాశపరిచింది. ఆ తరువాత బాద్‌ షా సినిమా పరవాలేదనిపించినా ఎన్టీఆర్‌ కెరీర్‌ను గాడిలో పెట్టే స్థాయి విజయం మాత్రం సాధించలేదు.

 

ఆ తరువాత వరుసగా ఫ్లాప్‌లు వెంటాయి. రామయ్య వస్తావయ్య, రభస సినిమాలు దారుణంగా నిరాశపరిచాయి. దీంతో ఎన్టీఆర్ ఆలోచనలో పడ్డాడు. రొటీన్‌ ఫార్ములా సినిమాల వల్లే ఫ్లాప్స్‌ వెంటాడుతున్నాయని భావించాడు తారక్‌. అందుకే పూర్తిగా రూట్‌ మార్చాడు. అప్పటి వరకు చేయనట్టుగా నెగెటివ్‌ టచ్‌ ఉన్న పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఎన్టీఆర్‌. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన టెంపర్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించాడు. ఆ సినిమాలో ఎన్టీఆర్ నటన, కథా కథనాలు ఆడియన్స్‌కు తెగ ఎక్కేశాయి. ఈ సినిమా సూపర్‌ హిట్ కావటంతో ఎన్టీఆర్‌ రేంజే మారిపోయింది. ఆడియన్స్‌లో ఎన్టీఆర్ ఇమేజ్‌ మారిపోవటంతో పాటు కథల ఎంపికలో ఎన్టీఆర్ ఆలోచనా విధానం కూడా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: