తెలుగు ఇండస్ట్రీలో ఎవరికీ లేని ఫ్యాన్ ఫాలోయింగ్ జూనియర్ ఎన్టీఆర్ కి ఉందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. అతడి చార్మింగ్ పర్సనాలిటీ తెలుగు రాష్ట్రాలలో కోట్లాది మంది ప్రజలను ఆకట్టుకుంది. డాన్స్ పరంగా యాక్షన్ పరంగా జూనియర్ ఎన్టీఆర్ కి ఎవరు సాటిరారు. తన మొహంలో పలికే ఎమోషన్స్, హావభావాలు అత్యంత సహజంగా ఉంటాయి. అలాగే తన డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉంటుంది. 2013వ సంవత్సరంలో విడుదలయిన బాద్షా సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించాడు. తారక్ సరసన కాజల్ అగర్వాల్ జానకి అనే పాత్రలో నటించింది. అయితే ఈ సినిమా జపనీస్ భాష లో డబ్ చేయబడగా... అక్కడి ప్రేక్షకులు జూనియర్ ఎన్టీఆర్ నటనా ప్రదర్శనకి ఫిదా అయిపోయారు. విశేషమేమిటంటే జపనీస్ ఫిలిం ఫెస్టివల్ కార్యక్రమానికి బాద్షా సినిమా నామినేట్ అయ్యింది. 


భారతీయ నటీనటులలో రజనీకాంత్ తర్వాత జపాన్ లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న నటుడిగా జూనియర్ ఎన్టీఆర్ రికార్డ్ సృష్టించాడు. జపానీస్ పీపుల్ చాలా తెలివైన వారు. వారు ఒక నటుడిని మెచ్చుకున్నారు అంటే ఆ నటుడు కంపల్సరిగా సూపర్ టాలెంటెడ్ అని అర్థం చేసుకోవాలి. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ హాలీవుడ్ సినిమాలో నటించినా... శ్వేతజాతీయులు అతడికి తప్పకుండా ఫాన్స్ అయిపోతారు అని నిస్సందేహంగా చెప్పవచ్చు.


బాహుబలి ద బిగినింగ్, బాహుబలి ది కంక్లూషన్ జాపనీస్ భాషలో జపాన్ లో విడుదల కాగా... కట్టప్ప, దేవసేన, అమరేంద్ర బాహుబలి పాత్రలు వారి మనసుల్లో శాశ్వతమైన స్థానాన్ని సంపాదించాయి. మనం చెప్పాం సినిమాలను చూడటంతో కానీ వారు మాత్రం మన సినిమాలను తరచుగా చూస్తూనే ఉంటారు. ఏదేమైనా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల్లో లాగా జపాన్ దేశంలో కూడా విశ్వసనీయమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉండటం విశేషమే. ఆర్ఆర్ఆర్ చిత్రం కూడా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవనుంది. ఈసారి ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ నటనకు జాపనీస్ బాగా ఎంజాయ్ చేస్తారు అని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: