1983 మే 20వ తేదీన నందమూరి హరికృష్ణ అతని రెండవ భార్య షాలిని లకు మెహదీపట్నం లో జూనియర్ ఎన్టీఆర్ పుట్టాడు. నందమూరి హరికృష్ణ మొదటి భార్య అయిన లక్ష్మికి జానకిరామ్ సుహాసిని కళ్యాణ్ రామ్ జన్మించారు. తారక తన చిన్నతనంలో బాగా అల్లరి చేసేవాడు. అతని అల్లరి తన కుటుంబంలోని ఎవరు భరించలేక పోయేవారు. ఒకరోజు తన అల్లరి హద్దులు మీరడంతో కోపోద్రిక్తురాలైన తన అమ్మ అతడిని బెల్టుతో గట్టిగా కొట్టిందట. దాంతో జూనియర్ ఎన్టీఆర్ బాగా మనస్థాపానికి గురై... తన అమ్మ పై అలిగి ఇంటి నుంచి పారిపోయాడు. మళ్లీ తిరిగి సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాడు. 

 

జూనియర్ ఎన్టీఆర్ రాకను చూసిన షాలిని వెంటనే పరుగు పరుగున వెళ్లి అతన్ని గట్టిగా హత్తుకొని ఇంకెప్పుడూ అల్లరి చేయకు నాన్నా అంటూ బుజ్జగించిందట. అలాగే తారక్ ఖాళీగా ఉంటే ఏదో ఒక అల్లరి పని చేస్తాడు అనే ఉద్దేశంతో అతడికి ఏదైనా మంచి ఎక్సట్రా కర్రిక్యులం యాక్టివిటీ నేర్పించాలని భావించారు. ఆ సందర్భంలోనే తారక్ కుటుంబానికి సన్నిహితులైన కొంతమంది తనకి భరతనాట్యం కూచిపూడి నేర్పించాలని అప్పుడే తారక్ కు మంచి క్రమశిక్షణ అలవడుతుందని షాలిని కి చెప్పారు. దాంతో షాలిని తారక్ ని మాస్టర్ సుధాకర్ వద్ద చేర్చింది. కేవలం కొన్ని నెలల్లోనే భరతనాట్యం కూచిపూడి లో నైపుణ్యం సాధించిన జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో స్టేజ్ షోలను ఇచ్చి గొప్ప డాన్సర్ గా పేరు సంపాదించాడు. 


ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ నగరంలోని విద్యా రాణి హై స్కూల్ లో చదువుకున్నాడు. స్కూల్లో కూడా తారక్ బాగా అల్లరి చేసేవాడట. అయినా కూడా తన క్లాసులో ఎప్పుడు టాప్ ర్యాంకర్ గానే నిలిచే వాడట. తారక్ కి అద్భుతమైన పట్టుదల ఉంటుంది. దానికి నిదర్శనంగా అతని విభిన్నమైన భౌతిక రూపాలు పట్టుగొమ్మగా నిలుస్తున్నాయి. ఏదేమైనా తారక నటనా ప్రతిభను ఎంజాయ్ చేస్తున్న మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడో ఏదో పుణ్యం చేసుకొనే ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: