షాక్ సినిమాతో దర్శకుడిగా మారిన హరీష్ శంకర్, ఆ తర్వాత వచ్చిన మిరపకాయ్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. మిరపకాయ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసిన గబ్బర్ సింగ్ చిత్రంతో స్టార్ దర్శకుడిగా మారిపోయాడు. ఆ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అప్పటి వరకూ ఫ్లాపుల్లో ఉన్న పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ తో భారీ విజయం దక్కింది.

 

పవన్ అభిమానులకి గబ్బర్ సింగ్ సినిమా ఫుల్ మీల్స్ లా అనిపించింది. అయితే ప్రస్తుతం మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రానుంది. రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వరుసగా మూడు ప్రాజెక్టుఅల్ని అనౌన్స్ చేశాడు కూడా. అందులో మూడవది హరీష్ దర్శకత్వంలోనే ఉండనుంది. అయితే ప్రస్తుతం చేస్తున్న రెండు చిత్రాలు కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోవడంతో హరీష్ సినిమా ఆలస్యం కానుంది.

 

మరి ఈ గ్యాప్ లో హరీష్ కొత్త సినిమా ఏదైనా ప్లాన్ చేస్తాడేమో అని ఆలోచిస్తున్నారు. పవన్ తో సినిమా అంటే భారీగా ఉంటుంది కాబట్టి, ప్రస్తుతం ఉన్న టైమ్ లో ఏదైనా చిన్న సినిమా తీస్తాడేమో అని సోషల్ మీడీయాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అలాంటి వాటికి సమాధానమిచ్చిన హరీష్ శంకర్, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి సినిమా స్క్రిప్టు మీదే వర్క్ చేస్తున్నాను. ఆల్రెడీ పవన్ కి లైన్ వినిపించాను.

 


ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది. సినిమా పూర్తయ్యేవరకు మరే సినిమా చెయ్యను. అది చిన్నదైనా, పెద్దదైనా పవన్ సినిమా పూర్తయ్యాకే మిగతా వాటిగురించి ఆలోచిస్తానని కాస్త గట్టిగానే చెప్పాడు. అంతా చెప్పి, తమ్ముడు నేను కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానినే అన్న విషయం మర్చిపోవద్దని గుర్తు చేశాడు. తన అభిమాన హీరోని అభిమానులకి నచ్చే విధంగా చూపించడంలో హరీష్ ని మించిన వారు లేరని చెప్పాలి. అందుకే హరీష్- పవన్ కళ్యాణ్ ల కాంబో సినిమాపై అంచనాలు బాగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: