బాలీవుడ్ నటులలో ఒకరైన నవాజుద్దిన్ సిద్ధిఖి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన ఎంతో తిరుగులేని క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. కేవలం సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే కామెడీ పంచడంలో కూడా ఆయన దిట్ట అని చెప్పవచ్చు. నటుడిగా ఆయన ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక గత కొద్ది కాలంగా తన వైవాహిక జీవితంలో సమస్యలను ఆయన ఎదుర్కొంటున్నారు.


ఇకపోతే తాజాగా ఆయన భార్య ఆలియా సిద్ధికి తనకు విడాకులు ఇవ్వాలంటూ కోర్టు మెట్లు ఎక్కారు ఆవిడ. అంతేకాదు ఆయనకు ఆమె తరఫున లాయర్లు నోటీసులు కూడా పంపడం జరిగింది. ఇక ఈ విషయంపై ఆలియా, లాయర్ కలిసి మీడియాతో కూడా మాట్లాడటం జరిగింది. వీరిద్దరి వివాహం 2009 సంవత్సరంలో జరిగింది. అయితే నవాజుద్దీన్ సిద్ధిఖి, ఆయన తమ్ముడు షామస్ కూడా నన్ను ఇద్దరు ఇబ్బంది పెడుతున్నారని అందుకే మా మధ్య సఖ్యత కుదరట్లేదు అనే ఉద్దేశంతో, అలాగే ఇతరేతర బయటికి చెప్పుకోలేని కారణాల వల్లనే మేము విడాకులు తీసుకుంటున్నామని ఆవిడ తెలిపింది.


అంతేకాకుండా వైవాహిక జీవితంలో ఆత్మగౌరం కూడా చాలా ముఖ్యమని ఆవిడ చెప్పక వచ్చింది. నిజానకి నేను ఎవరు భరించలేని బాధను కూడా భరించానని కూడా ఆవిడ తెలిపింది. ఇక మీద తన పేరు అంజన అనే విధంగా ఉపయోగిస్తారని ఆలియా సిద్ధిఖీ తెలిపారు. ఒకరి వల్ల వచ్చిన ఐడెంటిటీ నాకు అవసరం లేదని ఆలయ మరోసారి దాన్ని చెప్పింది. నా భవిష్యత్తు పై నాకు ఎలాంటి ఆలోచన లేదని కానీ ఈ వైవాహిక జీవితం నాకు సరిపోదని ఇకపై నేను పెళ్లి చేసుకోను అని ఆవిడ గట్టిగా చెప్పింది. కాకపోతే తన పిల్లల గురించి చెప్పగా వారు నా దగ్గరే ఉంటారు అని ఆవిడ పేర్కొంది. ఆవిడ లాయర్ మాట్లాడుతూ విడాకుల పత్రాలు ఈమెయిల్ ద్వారా పంపమని లాయర్ తెలిపారు. ఇక దానికి ఆయన అతి తొందరగా రిప్లై ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: