సినిమాల్లో సక్సెస్ కావటం వేరు.. సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణించడం వేరు. ఇక్కడ రెండో కేటగిరీకి చెందిన మీరోయిన్ భూమిక. తొలి సినిమా యువకుడులో చందమామ లాంటి అందంతో, తన నటనతో ఆకట్టుకుంది. యువకుడు సినిమా అంతగా సక్సెస్ కాకపోయినా భూమిక తెలుగు సినిమాల్లో రాణించిందంటే అందుకు ఆమె అందం, నటనే కారణం. నేటితో భూమిక తెరంగేట్రానికి 20 ఏళ్లు పూర్తయ్యాయి. కరుణాకరణ్ దర్శకత్వంలో 2000 మే 19న సుమంత్ హీరోగా యువకుడు సినిమా విడుదలైంది.

IHG

 

హీరోయిన్ గా ఆమె సక్సెస్ గ్రాఫ్ ఎవరికీ దక్కనిదనే చెప్పాలి. భూమిక కెరీర్ ను మలుపుతిప్పి ఆమెకు స్టార్ స్టేటస్ తెచ్చిన సినిమా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ‘ఖుషి’. ఈ సినిమా సృష్టించిన సంచలనం, తిరగరాసిన రికార్డులు గురించి తెలిసిన విషయమే. ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ తో భూమిక స్టార్ హీరోయిన్ గా మరిపోయింది. భూమికకు ఉన్న ట్రాక్ రికార్డ్ ఎంత ఘనమైందో ఓ ఉదాహరణ చెప్పుకోవాలి. పవన్ కల్యాణ్ ఖుషి, మహేశ్ ఒక్కడు, ఎన్టీఆర్ సింహాద్రి.. సినిమాలు వీరి కెరీర్లో 7వ సినిమాలు. ఈ మూడు సినిమాల్లోనూ హీరోయిన్ గా భూమిక నటించింది. ఈ మూడు సినిమాలు ఆ ముగ్గరి హీరోల కెరీర్లో అప్పటికి అతిపెద్ద బ్లాక్ బస్టర్స్.

IHG

 

ఇటువంటి రికార్డు మరే హీరోయిన్ కు లేదనే చెప్పాలి. భూమిక హీరోయిన్ గా వారి ఏడో సినిమాల్లో హీరోయిన్ గా చేయడం యాదృచ్ఛికమే. తర్వాత అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జునలతో కూడా ఆమె హీరోయిన్ గా నటించింది. కొనేళ్ల తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి యోగా మాస్టర్ భరత్ ఠాకూర్ ని వివాహం చేసుకుని సెటిల్ అయింది. ప్రస్తుతం కొన్ని తెలుగు సినిమాల్లో నటిస్తోంది.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: