కరణ్ జోహార్.. బాలీవుడ్ లో వెల్ నోన్ స్టార్ ప్రొడ్యూసర్. ఈ మధ్య స్క్రీన్ మీద కూడా కనిపిస్తున్నాడు . అంతేకాదు ..మంచి టేస్ట్ ఉన్న నిర్మాత. ఏదో ప్రొడ్యూసర్ అంటే డబ్బులు పెట్టి లెక్కలు చూస్కోడమే కాకుండా టాలెంట్ ని ఎంకరేజ్ చెయ్యడానికి ఎప్పుడూ ముందే ఉంటాడు. స్పెషల్లీ స్టార్ కిడ్స్ ని లాంచ్ చెయ్యడంలో ది బెస్ట్  లాంచింగ్ మాస్టర్ అనిపించుకుంటున్నాడు . 

 

 బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ గా థర్మ ప్రొడక్షన్స్ లో చాలా సినిమాలు నిర్మించాడు కరణ్ . వాటిలో చాలా సినిమాలు భారీ సక్సెస్ ని అందుకున్నవే . ఎందుకంటే .. కరణ్ .. స్టోరీకి తగినట్టు ఆర్టిస్టులని సెలక్ట్ చెయ్యడంలో , వాళ్లకి సజెషన్స్ ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పటికే తన ప్రొడక్షన్ లో  ఆలియా, వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ , అనన్య పాండే , ఈ షాన్ కట్టర్  లాంటి చాల మంది కొత్తవాళ్లని లాంచ్ చేసి లైఫ్ ఇచ్చాడు కరణ్

 

కరణ్ జోహార్ ఇప్పుడు మరో ఇద్దరు స్టార్ కిడ్స్ ని లాంచ్ చెయ్యబోతున్నాడు . శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ని తన ప్రొడక్షన్ లో ఇంట్రడ్యూస్ చేసిన ఈ స్టార్ ప్రొడ్యూసర్ ఇప్పుడు జాన్వి చెల్లెలు ఖుషీ ని కూడా సినిమాల్లోకి తీసుకొచ్చేప్రయత్నం చేస్తున్నాడు . అంతేకాదు .. బాలీవుడ్ బాద్ షా కూతురు సుహానా ఖాన్ ని కూడా తన ప్రొడక్షన్ లోనే బాలీవుడ్ లోకి ఇంట్రడ్యూస్ చేసే బాధ్యత తీసుకున్నాడు . సుహానా ఇప్పటికే షార్ట్ ఫిల్మ్స్ తో తనకెరీర్ స్టార్ట్ చేసేసింది. 

 

టాలెంట్ ని ఎక్కడ గుర్తించినా .. అక్కడికెళ్లి మరీ ఛాన్సులిస్తాడు కరణ్. ఎగ్జాంపుల్ టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండే . విజయ్ ..అసలు బాలీవుడ్ లో సినిమాలెందుకు అన్నాడు ..కానీ కరణ్ ఆఫర్ ఇచ్చేసరికి కళ్లు మూసుకుని ఒప్పేసుకున్నాడు . పూరీ జగన్ తో చేస్తున్న ఫైటర్ సినిమాని పూరీ కనెక్ట్స్ తో పాటు థర్మ ప్రొడక్షన్స్ కూడా నిర్మిస్తోంది. సో.. విజయ్ ని బాలీవుడ్ లో అఫీషియల్ గా లాంచ్ చేస్తోంది కరణ్ జోహారే . ఇలా  తన ప్రొడక్షన్ లో హీరో హీరోయిల్ని లాంచ్ చేస్తూ లాంచింగ్ మాస్టర్ అనిపించుకుంటున్నాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్ .

మరింత సమాచారం తెలుసుకోండి: