టాలీవుడ్ లో రానా పెళ్లి వార్త బయటకు రాగానే ఆ పెళ్లి గురించి జరుగుతున్న చర్చలు అన్నీ ఇన్ని కావు. ఆ పెళ్లి అక్కడ ఇక్కడ అప్పుడు ఇప్పుడు అంటూ ఎక్కువగా వార్తలు వస్తూనే ఉన్నాయి. పెళ్లి ఫైనల్ అయిన విషయం అందరికి తెలిసిందే. హైదారా బాద్‌కు చెందిన ఓ ప్ర‌ముఖ ఈవెంట్ ఆర్గ‌నైజ‌ర్ మిహీకా బ‌జాజ్‌ను రానా ప్రేమిస్తున్నాన‌ని చెప్ప‌డం ఆమె కూడా రానాకు ఓకే చెప్పిన సంగ‌తి తెలిసిందే. 

 

ఇక రానా పెళ్లి కూడా ఈ యేడాదే జ‌రుగుతుంద‌ని రానా తండ్రి.. ప్ర‌ముఖ నిర్మాత సురేష్ బాబు ద‌గ్గుబాటి సైతం ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే కొన్ని వార్తలు మాత్రం ఇప్పుడు ఆధారాలు లేకుండా వస్తున్నాయి. ఈ పెళ్లి విషయంలో రానా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు అని కొందరు స్టార్ హీరోలను పిలవవద్దు అని భావిస్తున్నాడట. 

 

తనను కొందరు టాలీవుడ్ లో అడుగుపెట్టిన సమయంలో టార్గెట్ చేశారని తన తండ్రి మీద ఉన్న కోపాన్ని కొందరు అగ్ర హీరోలు... నిర్మాతల సహకారంతో బాగా ఇబ్బంది పెట్టారని, వాళ్ళను ఇప్పుడు పెళ్ళికి పిలవ వద్దు అని రానా భావిస్తున్నాడు అని అంటున్నారు. దీని వెనుక వాస్తవాలు ఎంత వరకు ఉన్నాయి అనేది పక్కన పెడితే రానా తండ్రి సురేష్‌బాబు గ‌తంలో థియేటర్ ల విషయంలో చాలా దూకుడుగా ఉండే వారట. ఇక సురేష్ బాబు సైతం థియేట‌ర్ల సిండికేడ్‌ల‌లో ఒక టీం లీడ‌ర్ అన్న వార్త‌లు తెలిసిందే.

 

దానితో ఇప్పుడు స్టార్ హీరోలుగా ఉన్న ఒకరు ఇద్దరు బాగా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయని వారు రానా సినిమాను ఇబ్బంది పెట్టారని... అందుకే వారిని పెళ్ళికి పిలిచే ఆలోచన రానా భావించినట్టు సమాచారం. పెళ్లి ఎప్పుడు చేసుకునే అవకాశం ఉంది అనేది స్పష్టత రావడం లేదు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఈ వివాహం జరిగే అవకాశం ఉందని సమాచారం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: