సినిమా ఇండస్ట్రీ లో అనేక మంది అమ్మాయిలు హీరోయిన్లుగా రాణించాలని తెగ తాపత్రయ పడతారు. కొంతమంది కష్టపడి చిన్ననాటినుండే పేరుతెచ్చుకుని ఆ క్రేజీ బేస్ చేసుకుని హీరోయిన్ గా రాణిస్తుంటారు. మరికొంతమంది మోడలింగ్ చేసి ఆ పాపులారిటీ తో అవకాశాలను దక్కించుకుంటారు. అయితే ఎలా వచ్చినా హీరోయిన్లకు ఇండస్ట్రీలో చాలావరకూ లైంగిక వేధింపులు అనేవి కామన్ అని మీటు, కాస్టింగ్ కౌచ్ ఈ రెండిటి వల్ల సినిమా ఇండస్ట్రీలో ఒక అమ్మాయి ఎంట్రీ ఇస్తే ఏ విధమైన కష్టాలు పడుతూ ఉంటుందో  చాలామంది చెప్పుకొచ్చారు. కొంతమంది అయితే బట్టలు విప్పేసి మరి తమ గోడు వెళ్లబోసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటువంటి తరుణంలో అసలు క్యాస్టింగ్ కౌచ్ ఎంత దారుణంగా ఉంటుంది ఉన్న దాని గురించి మరాఠీ ఇండస్ట్రీకి చెందిన శృతి మరాతే అనే హీరోయిన్ తనకి ఎదురైన అనుభవాలు గురించి కీలకమైన వ్యాఖ్యలు చేసింది.

 

ఒక సినిమాకి కమిట్ అవుతున్న సమయంలో ఆ నిర్మాత వ్యవహరించిన తీరుకు చిరాకు పడుతున్న ప్రవర్తన కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చానని శృతి తెలిపింది. మామూలుగా ఎవరైనా మాట తీరు సరిగా లేకపోతే తప్పుగా మాట్లాడిన అక్కడినుంచి వెళ్ళిపోతాను.. కానీ ఆ నిర్మాతకు మాత్రం కౌంటర్ ఇచ్చానని తెలిపింది. ఆ నిర్మాత తనను ‘కాంప్రమైజ్ అవ్వాలని.. ఒక రాత్రి పడుకోవాలని చెప్పాడని’ హీరోయిన్ శృతి మరాతే హాట్ కామెంట్స్ చేసింది.

 

దానికి  నాకు చిరాకు వేసి.. హీరోను కూడా ఇలాగే అడిగావా? అతను కూడా పడుకోవాలా? అలా అయితేనే మీ సినిమాలో అవకాశం ఇస్తావా? ’ అని నిర్మాతకు మైండ్ బ్లాంక్ అయ్యేలా కౌంటర్ ఇచ్చానని శృతి తెలిపింది. దీంతో తాను చేసిన కామెంట్లకు నిర్మాత సీరియస్ అయి అప్పటికప్పుడు తనని సినిమా నుంచి తప్పించినట్లు గా మృతి చెప్పుకొచ్చింది. ఆ సినిమాలో అవకాశం రానందుకు నేను పెద్దగా బాధ పడలేదని ఇలాంటి విషయంలో ధైర్యంగా ఎదుర్కొన్నాను అని విలువలను కాపాడుకుని ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ప్రస్తుతం రాణిస్తున్నాని తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: