మహేష్ బాబు హీరోగా నటించిన భారతీయ సినిమాలో అతని స్నేహితుడి పాత్రలో నటించిన మోహర్ రమేష్ ఆంధ్రావాలా చిత్రాన్ని కన్నడలో రీమేక్ చేసి దర్శకుడిగా అవతారమెత్తాడు. ఆ తర్వాత 2008వ సంవత్సరంలో ఈ కొత్త డైరెక్టర్ మెహర్ రమేష్ కు జూనియర్ ఎన్టీఆర్ తన కంత్రి సినిమాకు దర్శకత్వం వహించేందుకు అవకాశం ఇచ్చాడు. ఆ సమయంలో మహేష్ బాబు పోకిరి, అల్లు అర్జున్ దేశముదురు లాంటి టైటిల్స్ తో వచ్చిన సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ కావడంతో తారక్ కూడా అటువంటి మాస్ మసాలా సినిమాల్లో నటించడానికి ఆసక్తి ఎక్కువ చూపి కంత్రి సినిమాలో నటించాడు. 

 


కానీ ఎన్టీయార్ కెరీర్ లోనే ఆ సినిమా అతి పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఈ చిత్రాన్ని చూసిన సినీ ప్రేక్షకులంతా పోకిరి సినిమా లాంటి ట్విస్టులతో డైరెక్టర్ సినిమా తీయడానికి ప్రయత్నించాడని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సరే ఒక సినిమా అట్టర్ ఫ్లాప్ అయితే అయ్యిందిలే అనుకున్న ఎన్టీఆర్ మోహర్ రమేష్ పై నమ్మకం అనువంత అయినా కోల్పోలేదు. 

 

దాంతో కంత్రి సినిమా ఫ్లాప్ అయినా... ఎన్టీయార్ అదే దర్శకుడితో శక్తి సినిమా తెరకెక్కించాడు. మొదటిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మగధీర సినిమా తరహా కథతో మెహర్ రమేష్ ఎన్టీయార్ ను ఏదోలా ఒప్పించి అతని తన సినిమాల్లో నటింపచేశాడు. అశ్వనీదత్ నిర్మాతగా 45 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన శక్తి చిత్రం తొలి ఆటకే అట్టర్ ఫ్లాప్ అనే టాక్ సంపాదించింది.


దాంతో డైరెక్టర్ మోహర్ రమేష్ ని రెండు సార్లు గుడ్డిగా నమ్మి మాటల్లో వర్ణించలేనంతగా మోసపోయాడు తారక్. శక్తి సినిమా ఎలాగోలా కొన్ని రోజులపాటు థియేటర్ లో ఆడి బాక్సాఫీస్ వద్ద 20 కోట్ల కలెక్షన్లు సంపాదించింది. ఏది ఏమైనా ఎన్టీయార్ మెహర్ రమేష్ ను నమ్మి రెండుసార్లు మోసపోయాడు. ఇంకో సినిమా అతడితో తీసి హ్యాట్రిక్ డిజాస్టర్స్ తన జాబితాలో వేసుకునేందుకు తారక్ సాహసం చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: