బుధవారం ఎన్టీఆర్ బర్త్ డే రోజు ఆర్ఆర్ఆర్ టీజర్ రావడం లేదని ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయిన సంగతి తెలిసిందే. టీజర్.. ఫస్ట్ లుక్ లేకపోయినా.. మరోలా ట్రీట్ ఇవ్వడానికి ట్రిపుల్ ఆర్ టీమ్ రెడీ అయింది. ఎన్టీఆర్ కు ఇది చాలా స్పెషల్ బర్త్ డే. 19ఏళ్ల కెరీర్ లో ఫస్ట్ టైమ్ రాజమౌళి ఆశీస్సులతో పాన్ ఇండియాలోకి అడుగుపెడుతున్నాడు. ఇందులో నటిస్తున్న మరో హీరో రామ్ చరణ్ జంజీర్ తో హిందీలో అడుగుపెట్టాడు. ఎన్టీఆర్ మాత్రం బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైమ్.

 

ఎన్టీఆర్ బాలీవుడ్ డ్రీమ్ లేటుగా తీరుతోంది. జులై 31న రిలీజ్ కావాల్సిన ఆర్ఆర్ఆర్ జనవరి 8కు వెళ్లింది. కరోనా ఎఫెక్ట్ తో 2021 సమ్మర్ లో విడుదల కానుంది. బాహుబలితో రాజమౌళికి హిందీలోనే కాదు.. ఇండియా వైడ్ పాపులారిటీ ఉంది. దర్శకదీరుడి ఇమేజ్. ఎన్టీఆర్ కు ఉపయోగపడనుంది. ఆల్ రెడీ భీమ్ ఫర్ రామరాజు టీజర్ వాయిస్ చెప్పి తమిళ తంబీలను.. కన్నడిగులను.. హిందీ వాళ్లను ఒకేసారి ఆకట్టుకున్నాడు ఎన్టీఆర్. 

 

ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా టీజర్ ను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించినా.. పరిస్థితులు అనుకూలించలేదు. ఫస్ట్ లుక్ కూడా ఉండదని చిత్ర యూనిట్ ఆల్ రెడీ చెప్పేసింది. అయితే ఓ వర్కింగ్ స్టిల్ ను రిలీజ్ చేయాలనుకుంటున్నారట. అలాగే.. వర్కవుట్స్ వీడియోను కూడా విడుదల చేసే అవకాశం ఉందని తెలిసింది. అసలు లేకపోవడం కంటే.. ఏదో ఒకటి వస్తే.. ఫ్యాన్స్ ఖుషీ అవుతారు. 

 

ఎన్టీఆర్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ రిలీజ్ కాకుండానే.. మరిన్ని పాన్ ఇండియా మూవీస్ ఓకే చేశాడు. ట్రిపుల్ ఆర్ తో వచ్చే ఇమేజ్ ను కంటిన్యూ చేసి రెమ్యునరేషన్ తో పాటు.. బిజినెస్ పెంచుకునే క్రమంలో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ సెలక్ట్ చేసుకుంటున్నాడు తారక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: