గబ్బర్ సింగ్ సినిమా తర్వాత టాలీవుడ్ లో హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా అనగానే ప్రేక్షకులకు ఒక రకంగా పండగ అనే చెప్పుకోవాలి. వాళ్ళ కాంబినేషన్ లో సినిమా రావాలని మళ్ళీ ఆ విధమైన సినిమాను తీసుకుని రావాలి అని ప్రయత్నాలు చేస్తూ వస్తు ఉన్నారు. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ తో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ సినిమాను ఇప్పుడు సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళడానికి హరీష్ శంకర్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. 

 

అది ఏంటీ అనేది చూస్తే ఈ సినిమా బాలీవుడ్ రీమేక్ అని సమాచారం. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటించిన ఒక సినిమా రీమేక్ అని అంటున్నారు. దీని గురించి ఇంకా స్పష్టత లేదు గాని గతంలో గబ్బర్ సింగ్ సినిమా కూడా రీమేక్ అనే సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాను కూడా అలాగే తీసుకుని రావాలి అని భావించి హక్కులను కూడా కొనుగోలు చేసారు అని సమాచారం. అన్నీ అనుకున్న విధంగా జరిగితే ఈ ఏడాది చివర్లో ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 

 

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది రావడం దాదాపుగా ఖాయంగా కనపడుతుంది. దీని గురించి త్వరలోనే డేట్ ని కూడా ప్రకటించే సూచనలు ఉన్నాయని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఈ సినిమా మాత్రం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా కాబట్టి.

మరింత సమాచారం తెలుసుకోండి: