టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగి కనుమరుగు అయిపోయిన హీరో తరుణ్. అతని సినిమాలు అనగానే అభిమానులకు ముందు ఒక ఆసక్తి ఉండేది. అప్పట్లో యువత అతని సినిమాల కోసం ఎక్కువగా ఎదురు చూసేది. అయితే ఆ తర్వాత మాత్రం అతను సినిమాలు చేయడానికి ఇబ్బంది పడి పూర్తిగా సినిమాలకే దూరం అయ్యాడు. అసలు అతని కెరీర్ ఆ విధంగా ఎందుకు అలా అయిపోయింది అనేది తెలియదు గాని అతను మాత్రం ఇప్పుడు మళ్ళీ సినిమాలు చెయ్యాలి అని భావిస్తున్నాడు అనే వార్తలు మాత్ర౦ వస్తున్నాయి తరుణ్ ఇప్పుడు ఒక సినిమాలో కనపడే సూచనలు ఉన్నాయని అంటున్నారు. 

 

తరుణ్ ని రామ్ చరణ్ తన సినిమాలో తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అని అంటున్నారు. రామ్ చరణ్ అనీల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది. ఆ సినిమాలో ఆయన్ను తీసుకోవడానికి గానూ రామ్ చరణ్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు అనే ప్రచారం జరుగుతుంది. మరి తీసుకుంటాడా లేదా అనేది చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావాలి అనుకున్నారు గని అది సాధ్యం అయ్యే అవకాశాలు ఏ విధంగా చూసినా సరే కనపడటం లేదు అనేది అర్ధమవుతుంది. 

 

ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అనే సినిమా కోసం రామ్ చరణ్ పూర్తిగా కష్టపడుతున్నాడు. మరి ఆ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో ఈ సినిమాను ఎప్పుడు సెట్స్ మీదకు తీసుకుని వెళ్తారో చూడాలి. రామ్ చరణ్ మాత్రం అన్నీ అనుకున్నట్టు జరిగితే అనీల్ రావిపూడి సినిమాను వచ్చే ఏడాది డిసెంబర్ లో విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అని తెలుస్తుంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ లో అతను అల్లూరి సీతారామ రాజు అనే పాత్రలో నటిస్తున్నాడు. ఈ పాత్రకు లుక్ కూడా వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: