మహేష్ బాబు ఇప్పుడు పరుశురాం సినిమా కోసం ఏ విధంగా కష్టపడుతున్నాడు అనేది అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర గురించి అనేక చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అతని పాత్ర కోసం దర్శకుడు చాలా విధాలుగా కష్టాలు పడుతున్నాడు అని అంటున్నారు. ఇప్పుడు మహేష్ బాబు కూడా అదే విధంగా ఆ పాత్ర కోసం కష్టపడుతున్నాడు అని తెలుస్తుంది. అతని సినిమా కోసం మహేష్ బాబు దాదాపు పది కేజీలు బరువు పెరిగే అవకాశం ఉందని సమాచారం. అతను అందుకే ఇప్పుడు ఇంట్లో కష్టపడుతున్నాడు అని తెలుస్తుంది. 

 

తనలో తాను చాలా వరకు మార్పులు కూడా చేసుకున్నాడు అనేది చాలా మంది మాట్లాడుతున్న మాట. ఇదే విషయాన్ని అతని మొహం చూసి చెప్పవచ్చు అని అంటున్నారు. ఇప్పుడు అతను ఎప్పుడు లేని విధంగా ఒక సినిమా కోసం నానా కష్టాలు పడుతున్నాడు అని సమాచారం. ఇక భార్య కూడా ప్రత్యేక వైద్యుల సమక్షంలో మహేష్ కి ఆహారం గాని ఇతరత్రా ఇస్తున్నారు అని తెలుస్తుంది. మహేష్ బాబు ఇప్పుడు చాలా వరకు సినిమా మీద దృష్టి పెట్టాడు. తొలి సారి అతను ఒక భారీ ప్రయోగం చేయడానికి సిద్దంగా ఉన్నాడు అని అంటున్నారు. మరి ఆ ప్రయోగం ఏ విధంగా ఫలితాన్ని ఇస్తుంది అనేది చూడాలి అనేది టాలీవుడ్ జనాల మాట. 

 

సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మహేష్ బాబు కూడా ఎలా అయినా సరే ఈ సినిమాను వచ్చే ఏడాది తీసుకుని రావడానికి బాగా కష్టపడుతున్నాడు అని దర్శకుడికి కూడా ఇదే విషయాన్ని మహేష్ రెండు మూడు సందర్భాలలో చెప్పాడు అని అంటున్నారు. మరి ఈ సినిమాను అనుకున్న సమయంలోగా విడుదల చేస్తారా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: