టాలీవుడ్ లో ఇప్పుడు చిన్న హీరోలకు డిమాండ్ అనేది పెరుగుతుందా...? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. చిన్న హీరోలు ఇప్పుడు వరుసగా సినిమాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. దానికి ప్రధాన కారణం ఏంటీ అనేది చూస్తే టాలీవుడ్ లో ఇప్పుడు నిర్మాతలు చాలా వరకు నష్టాల్లో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలను చెయ్యాలి అని అనుకోవడం లేదు అంటూ వార్తలు వస్తు ఉన్నాయి. ఎంత వరకు కూడా చాలాసినిమాలను ఖర్చు తగ్గించుకుని చెయ్యాలి అని భావిస్తున్నారు అని అంటున్నారు. 

 

చిన్న చిన్న హీరోల సినిమాలు అయితే హడావుడి లేకుండా తక్కువ బడ్జెట్ సినిమాలతో పూర్తి చేసి హిట్ కొడితే లాభం ఫ్లాప అయితే తక్కువ నష్టం అనే విధంగా ఆలోచన చేస్తూ వస్తున్నారు అని అంటున్నారు. అగ్ర హీరోల సినిమాలు ఇప్పట్లో వద్దు అనే భావన లో ఉన్నారు నిర్మాతలు అనే ప్రచారం మాత్రం ఇప్పుడు బాగా జరుగుతుంది టాలీవుడ్ లో. అగ్ర హీరోల సినిమాలు అయితే అనవసరంగా నష్టపోయే పరిస్థితి ఉంటుంది అని వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడాలి అనే భావన లో ఉన్నారు అని అంటున్నారు. టాలీవుడ్ లో చాలా వరకు నిర్మాతలు ఇప్పుడు ఎక్కువగా నష్టాలు ఎదుర్కొనే పరిస్తితిలోనే ఉన్నారు అనేది వాస్తవం. 

 

అందుకే ఇప్పుడు అవసరం లేకుండా ఖర్చు లు వద్దు అనే భావన లో ఉన్నారు అని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు చిన్న హీరోల కోసం మంచి కథలను సిద్దం చేసి సినిమాలను చెయ్యాలి అని భావిస్తున్నారు అని అంటున్నారు. మరి ఎన్ని రోజులు ఈ విధంగా సినిమాలు చేస్తారు అనేది చూడాలి. అగ్ర హీరోలు కూడా ఇప్పుడు ఈ విషయంలో దాదాపుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అని సమాచారం. మరి ఇది ఎంత కాలం ఉంటుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: