టాలీవుడ్ లో హరీష్ శంకర్ షాక్ సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత మాస్ మహా రాజ రవితేజ తో మిరపకాయ్ తీసి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించిన గబ్బర్ సింగ్ దర్శకుడిగా హరీష్ శంకర్ స్టామినా ఏంటో చూపించాడు. దాంతో హరీష్ శంకర్ పేరు ఇండస్ట్రీ మొత్తం మార్మోగిపోయింది. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ ల లెక్కేంటో చూపించారు. అప్పటి నుంచే పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో మళ్ళీ సినిమా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

ఇక హరీష్ శంకర్ ఆ తర్వాత అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాధం, వరుణ్ తేజ్ తో గద్దల కొండ గణేష్ సినిమాలను తెరకెక్కించి మంచి కమర్షియల్ సక్సస్ లను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ రెండు సినిమాల విషయంలో హరీష్ శంకర్ చిన్న చిన్న కాంట్రవర్సీలను ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా గద్దలకొండ గణేష్ సినిమా విషయంలో ఏకంగా టైటిల్ మార్చేవరకు వివాదం బాగా ముదిరింది. వాల్మీకి అని అనుకున్న ఈ సినిమాకి సరిగ్గా విడుదలకి ఒకరోజు ముందు గద్దలకొండ గణేష్ గా మార్చవలసి వచ్చింది.

 

ఇక ప్రస్తుతం హరీష్ శంకర్ పవర్ స్టార్ తో సినిమాకి సన్నాహాలలో ఉన్నాడు. ఈ సినిమాకోసం కథ సిద్దం చేసే పనిలో బిజీగా ఉన్నాడు. రెండేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఆ తర్వాత క్రిష్ సినిమాని కంప్లీట్ చేస్తాడు. ఈ రెండు సినిమాలు పూర్తి చేశాక హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా ఉండబోతుంది.

 

అయితే రీసెంట్ గా ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ హరీష్ శంకర్ తో నెక్స్ట్ సినిమా ఉండబోతుందంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇంతక ముందు హరీష్ శంకర్ 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ లో గద్దల కొండ గణేష్ తీసి హిట్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు హరీష్ శంకర్ 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ లో చేయబోయోది  పవన్ కళ్యాణ్ తోనా అన్న ఆసక్తి ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ లోను మొదలైంది. అందుకు కారణం ప్రస్తుతం హరీష్ శంకర్ దృష్టి మొత్తం పవన్ కళ్యాణ్ సినిమా మీదే ఉండటం. మరి ఈ అనౌన్స్ మెంట్ లో హీరో ఎవరన్నదే సస్పెన్స్ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: