పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తూ చేస్తున్న సినిమా వకీల్ సాబ్. బాలీవుడ్ కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన పింక్ సినిమాకి అఫీషియల్ రీమేక్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియోషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మిస్తుండగా బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. కాని కరోనా షాకిచ్చింది. కరోనా లాక్ డౌన్ తో లాకయినా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మళ్ళీ లాక్ డౌన్ ఎత్తేశాక కంప్లీట్ చేయనున్నారు. ఆగస్టు 15 న రిలీజ్ అనుకున్నారు. అయితే మరో నెల ఆలస్యం అయినా అవచ్చు. 

 

ఇక వకీల్ సాబ్ తర్వాత క్రిష్ తో మరో సినిమా చేసున్న పవన్.. ఆ సినిమా కోసం బాగా కష్టపడాలి. అంతేకాదు ఈ సినిమా కోసం డేట్స్ కూడా ఎక్కువగానే కేటాయించాలట. ఇక క్రిష్ కూడా పవన్ కోసం పక్కా ప్రణాళికలు వేసుకుని రెడీగా ఉన్నాడట. అయితే కరోనా తో క్రిష్ అనుకున్న ప్లాన్స్ మొత్తం చేంజ్ చేశారట. లొకేషన్స్ కోసం విదేశాలకి వెళ్ళకుండా రాజమౌళి ని ఫాలో అయి ఆర్ ఎఫ్ సి లో షూటింగ్ చేయాలని డిసైడయ్యారట.

 

క్రిష్ - పవన్ కళ్యాణ్ సినిమా చారిత్రాత్మక నేపథ్యం ఉన్న మొఘలాయిల కాలం నాటి పిరియాడికల్ బ్యాగ్డ్రాప్ లో రూపొందే సినిమా. దాంతో ఈ సినిమా కోసం ముందు నార్త్ ఇండియాకు వెళ్లాల‌నుకున్నారట. ఎక్కువ భాగం షూటింగ్ అక్కడే కంప్లీట్ చేయాలనుకున్నారట. కానీ కరోనా కారణంగా ఇప్పుడు ఆ ప్లాన్ మారింది.

 

కరోనా ప్రభావం ఉన్న రాష్ట్రాలతో పనిలేకుండా లాక్ డౌన్ ముగిసే టైం కి రామోజీ ఫిలిం సిటీలో సెట్స్ వేసి అక్కడే షూటింగ్ చిత్రీకరణ కానిచ్చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో క్రిష్ ఆర్ట్ డైరెక్టర్‌తో కలిసి రామోజీ ఫిలిం సిటీలో సెట్స్ వేయడానికి రెడీ అవుతున్నారట. వకీల్ సాబ్ కంప్లీటవగానే పవన్ కళ్యాణ్ క్రిష్ ప్రాజెక్ట్ లో జాయిన్ అవుతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: