మెగాస్టార్ చిరంజీవి గత ఏడాది సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. స్వతంత్ర పోరాటం నేపథ్యంలో ఎంతో భారీ ఖర్చుతో తెరకెక్కిన ఆ సినిమా అప్పట్లో కేవలం యావరేజ్ విజయాన్ని మాత్రమే అందుకోగలిగింది. ఇక దాని తరువాత మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఆచార్య. వరుస విజయాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని మాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్లు కలిసి నిర్మిస్తుండగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగం వరకు పూర్తి అయింది. 

IHG

అయితే కొద్దిరోజులుగా కరోనా ఎఫెక్ట్ తో మిగతా సినిమా షూటింగ్స్ తో పాటు ఆచార్య షూటింగ్ కూడా వాయిదా పడడటంతో అనుకున్న సమయానికి సినిమాని విడుదల చేసే అవకాశం ప్రస్తుతం లేదని సమాచారం. ఇక ఈ సినిమాలో ఎంతో కీలకమైన ఒక ముఖ్య పాత్రలో రామ్ చరణ్ తీసుకుందాం అని సినిమా యూనిట్ భావించింది, అయితే ఆయన అప్పటికే ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాల్గొంటుండడంతో ఈ సినిమాలో ఎంతవరకు నటిస్తారు అనేది అతి త్వరలో నిర్ణయిస్తాం అని కొద్దిరోజుల క్రితం ఒక ఇంటర్వ్యూ లో దర్శకుడు కొరటాల మాట్లాడుతూ చెప్పారు. అలానే ఈ సినిమా కథని సూపర్ స్టార్ మహేష్ కు వినిపించగా, అవసరం అయితే మీకు నేనున్నాను అంటూ మహేష్ మాట ఇచ్చి తన గొప్పమనసుని చాటుకున్నారని కూడా కొరటాల చెప్పడం జరిగింది. 

 

మరోవైపు ఈ లాక్ డౌన్ దెబ్బకు ఆర్ఆర్ఆర్ షూటింగ్ కూడా వాయిదా పడడంతో, ఇది ముగిసిన అనంతరం చరణ్, ఆర్ఆర్ఆర్ షూట్ లో ఫుల్ బిజీగా ఉంటారని, దానిని బట్టి ఆ స్పెషల్ క్యారెక్టర్ ని మహేష్ పోషించే ఛాన్స్ కూడా లేకపోలేదని కూడా అంటున్నారు. ఇప్పటికే తన 27వ సినిమాకు సంబంధించి అన్ని పనులు సిద్ధం చేసిన మహేష్, నిజంగానే ఆచార్య లో నటిస్తారా లేదా అనేది తెలియాలంటే మాత్రం పూర్తిగా ఈ లాక్ డౌన్ ముగిసి, సినిమా షూటింగ్స్ మళ్ళి మొదలైతేనే కానీ స్పష్టం కాదని అర్ధం అవుతోంది....!!!

మరింత సమాచారం తెలుసుకోండి: