జూనియర్ ఎన్టీయార్. పిలుచుకోవడానికి అలా వీలుగా జూనియర్ అంటారు కానీ అన్ని విధాలుగానూ ఈ తారకరాముడు సీనియరే. ఆ తారకరాముడి అచ్చమైన నటనా వారసుడు. సీనియర్ ఎన్టీయార్ నటనను పుణికిపుచ్చుకుని మరీ వెండితెర మీద రాణిస్తున్న నందమూరి వంశాంకురం.

 

జూనియర్ ఎన్టీయార్ కేవలం 17 ఏళ్ళ వయసులోనే స్టూడెంట్ నంబర్ వన్ మూవీలో హీరోగా అదరగొట్టాడు. సూపర్ హిట్ ఇచ్చాడు. అంతకు ముందు నిన్ను చూడాలని సినిమాతో ఎంట్రీ ఇచ్చినా కూడా రాజమౌళి డైరెక్షన్లో సరైన బొమ్మ పడింది మాత్రం స్టూడెంట్ నంబర్ వన్ లోనే. ఆ మీదట జూనియర్ ఆగలేదు. తగ్గలేదు. 18 ఏళ్ల వయసులోనే ఆది మూవీతో బాక్సాఫీస్ బద్దలు కొట్టేశాడు.  వీవీ వినాయక్ కి అది ఫస్ట్ మూవీ. అప్పటి సూపర్ స్టార్ల ముందు చిచ్చరపిడుగులా మరి ఫ్యూచర్ స్టార్ అనిపించుకున్నాడు.

 

ఇక ఆ తరువాత జూనియర్ కి  సరైన ఇండస్ట్రీ హిట్ పడింది సింహాద్రి రూపంలో. ఈ మూవీతో ఎన్టీయార్ ఓ విధంగా టాలీవుడ్ ని గట్టిగానే చాలెంజి చేశాడనే చెప్పాలి. కలెక్షన్ల వరద పారించి కొత్త శకానిదే సిల్వర్ స్క్రీన్ అని గట్టిగా చెప్పేశాడు.  జూనియర్ ఎన్టీయార్ పక్కా మాస్ మూవీస్ చేస్తూనే తన నటనకు మెరుగులు దిద్దుకున్నాడు.

 

జూనియర్ యమదొంగతో టాప్ రేంజి హీరో అయిపోయాడు. ఇక ఆ తరువాత బ్రుందావనం లాంటి ఫ్యామిలీ మూవీస్ చేస్తూనే అదుర్స్ వంటి కామెడీ టచ్ ఉన్న మూవీస్ చేస్తూ వచ్చాడు. జూనియర్ లో నవరసాలు పలికించే దమ్ము ఉందని బోయపాటి నిరూపించాడు. ఇక జూనియర్ తో పౌరాణికం తీస్తే ఎలా ఉంటుందో కాస్తా యమ దొంగలో రుచి చూపించాడు రాజమౌళి.

 

మరి రాజమౌళి డైరెక్షన్లో ఇపుడు ఆర్.ఆర్.ఆర్ మూవీలో జూనియర్ నటిస్తున్నాడు. ఈ మూవీ రిలీజ్ తరువాత జూనియర్ పాన్ ఇండియా హీరోగా పతాకం ఎగరవేస్తాడన్నది నిజం. ఇందులో డౌట్ లేదు. ఇవన్నీ పక్కన పెడితే జూనియర్ కి కూడా తన తాత ఎన్టీయార్ లా పౌరాణికాలు చేయాలని ఉంది. బాల రామాయణంతో రాముడిగా అలరించిన జూనియర్ కి క్రిష్ణుడిగా చేయాలని ఉంది. అదే అతని డ్రీమ్ ప్రాజెక్ట్ అవుతుంది అని కూడా అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: