కమర్షియల్ సినిమాలకు మాస్ హంగులు అద్ది సినిమాలు తీయడంలో మంచి దిట్టగా పేరున్న దర్శకుడు హరీష్ శంకర్. ముందుగా రవితేజ, జ్యోతిక ల కాంబో తెరకెక్కిన షాక్ సినిమా తో దర్శకుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన హరీష్ శంకర్, ఫస్ట్ మూవీ తో పెద్ద పరాజయాన్నిఅందుకున్నారు. ఇక ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకుని మరొక్కసారి రవితేజతో ఆయన తీసిన మిరపకాయ్ సినిమా సూపర్ డూపర్ హిట్ కెరీర్ పరంగా హరీష్ శంకర్ కు మంచి సక్సెస్ ని అందించడం జరిగింది. ఇక ఆతరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఆయన తీసిన గబ్బర్ సినిమా సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2012 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో అతి పెద్ద సక్సెస్ ని అందుకుంది. 

 

ఇక వాటి తరువాత ఆయన తీసిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, డీజే, గద్దలకొండ గణేష్ సినిమాలు కూడా మంచి సక్సెస్ లు అందుకోవడంతో హరీష్ శంకర్ కు మరింతగా మంచి పేరు దక్కింది. ఇక అతి త్వరలో తనకు ఇష్టమైన నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఒక సినిమా చేయనున్న హరీష్, ఆ పై తదుపరి చేయబోయే సినిమాని కూడా ఇటీవల అధికారికంగా ప్రకటించడం జరిగింది. గతంలో గద్దలకొండ గణేష్ సినిమాని తీసిన 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పైనే మరొక సినిమాకి తాను దర్శకత్వం వహించబోతున్నట్లు హరీష్ తెలిపారు. ఆ సూపర్ ఎక్సయిటింగ్ ప్రాజక్ట్ కోసం తాను కూడా ఎదురు చూస్తున్నట్లు హరీష్ అన్నారు. అయితే అందుతున్న సమాచారాన్ని బట్టి ఆ సినిమా సూపర్ స్టార్ మహేష్ తో చేయబోతున్నట్లు చెప్తున్నారు. 

 

వాస్తవానికి కొద్దిరోజుల క్రితం ఒక మీడియా ఇంటర్వ్యూ లో భాగంగా పవన్ సినిమాతో పాటు, మహేష్ గారి కోసం కూడా ఒక పవర్ఫుల్ స్టోరీని సిద్ధం చేస్తున్నాను అంటూ హరీష్ చెప్పడం జరిగింది. మరోవైపు 14 రీల్స్ ప్లస్ వారి అనుబంధ సంస్థైన 14 రీల్స్  బ్యానర్ పై గతంలో మహేష్ వన్ నేనొక్కడినే, ఆగడు సినిమాలు చేసి ఉండడంతో ఈ సినిమాని వారు మహేష్ తోనే చేయబోతున్నట్లు చెప్తున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తే కనుక నిజం అయితే మాత్రం అటు పవన్ తో పాటు ఇటు మహేష్ తో కూడా సినిమాలు చేసే గొప్ప అవకాశాన్ని హరీష్ అనుకున్నట్లే మరి....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: