టాలీవుడ్ నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు తన 36వ జన్మదినాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఇప్పటికే పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆయన అభిమానులు హడావుడి మొదలెట్టేసారు. అయితే ముందుగా ఆయన ప్రస్తుతం నటిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ నుండి కొమరం భీం లుక్ రిలీజ్ అవుతుంది అందరూ భావించారు. కానీ కొన్నాళ్లుగా మన దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో అది కుదరలేదని, మరికొద్దిరోజుల్లో అన్ని సర్దుకున్న తరువాత ఎన్టీఆర్ పోషిస్తున్న కొమరం భీం ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తాం అని ఆర్ఆర్ఆర్ టీమ్ ఒక అధికారిక ప్రకటన చేయడం జరిగింది. 

IHG'Bigil', <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=DIRECTOR' target='_blank' title='director-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>director</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=ATLEE KUMAR' target='_blank' title='atlee-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>atlee</a> Deserves No Clemency; He Is Peddling Hate

అయితే దానితో కొంత నిరాశ చెందిన ఎన్టీఆర్ ఫ్యాన్స్, రాబోయే మరికొద్ది రోజుల్లోనే తమ హీరో ఫస్ట్ లుక్ వస్తే బాగుండు అంటూ ఆశపడుతున్నారు. ఇకపోతే ఇప్పటివరకు పూర్తి తెలుగు సినిమాల్లోనే నటించిన ఎన్టీఆర్ కు అటు తమిళనాడు సహా పలు ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి పేరు ఉంది. కాగా తమిళనాడులో అయితే ఎన్టీఆర్ సినిమా కోసం ఎందరో ఎగబడుతుంటారని, ఇక్కడి ఆయన సినిమాలు అక్కడ డబ్ కాబడి మంచి విజయాలు కూడా అందుకున్నట్లు పలువురు అక్కడి విశ్లేషకులు చెప్తున్నారు. ఇక ఎన్టీఆర్ కు పలువురు తమిళ దర్శకులతో సైతం మంచి పరిచయాలు ఉన్నాయని, మరీ ముఖ్యంగా ఇటీవల విజయ్ హీరోగా వచ్చిన విజిల్ సినిమా దర్శకుడు అట్లీ కుమార్ తో ఎన్టీఆర్ కు మరింత మంచి అనుబంధం ఉందని ఇటీవల స్వయంగా అట్లీ నే ఒక ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పడం జరిగింది. 

 

తన సినిమా ఏదైనా రిలీజ్ అయింది అంటే, అందరికంటే ముందుగా ఎన్టీఆర్ గారి నుండే తనకు అప్రీషియేషన్ కాల్ వస్తుందని, అందరికంటే ముందుగా తన ప్రతి సినిమాని అభినందించే మంచి మనసున్న ఎన్టీఆర్ నిజంగా ఒక స్టార్ కాదని, అంతకుమించి ఎంతో గొప్ప మనసున్న వ్యక్తి అని అట్లీ ఆ ఇంటర్వ్యూ లో చెప్పారు. కాగా తాను కూడా ఎన్టీఆర్ ని దర్శకత్వం వహించబోయే మంచి ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నానని, ఆ రోజు అతిత్వరలో రావాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్లు అట్లీ తెలిపారు......!!!  

 

మరింత సమాచారం తెలుసుకోండి: