కరోనా దెబ్బతో షూటింగ్ లు ఆగిపోవడంతో చిన్నస్థాయి నటీనటులు మాత్రమే కాకుండా టాప్ రేంజ్ క్రేజీ హీరోయిన్స్ కూడ విపరీతంగా ఇబ్బంది పడుతున్నట్లుగా ఒక మీడియా సంస్థ తన ఆసక్తికర కథనంలో పేర్కొంది. టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుని ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్న అనేకమంది క్రేజీ బ్యూటీలకు ఈకరోనా లాక్ డౌన్ దెబ్బ శాపంగా మారింది అని ఆకథనం అభిప్రాయం.


సంవత్సరానికి కోటి రూపాయల నుండి మూడు కోట్ల వరకు సంపాదించే అనేకమంది హీరోయిన్స్ తమ ఆదాయాలు ఇలాగే కొనసాగుతాయి అని భ్రమపడి హైదరాబాద్ ఐటీ జోన్ లో అత్యంత విలాసవంతమైన ఇళ్ళను నెలకు 6లక్షలు ఇఎమ్ఐ కట్టేవిధంగా ఇళ్ళను అదేవిధంగా కోట్లరూపాయల విలువచేసే ఖరీదైన కార్లను అత్యంత విలాసవంతమైన ఖరీదైన నగలను ఇలా అన్నింటిని అనేకమంది క్రేజీ హీరోయిన్స్ ఇన్ స్టాల్ మెంట్ పద్ధతిలో కొనడంతో నెలకు ఈహీరోయిన్స్ కట్టవలసిన ఇఎమ్ఐ లు కొన్ని లక్షల రూపాయల స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది.


దీనికితోడు తమ క్రేజీ పారితోషికాలు ఇలాగే కొనసాగుతాయి అన్న ఊహలతో అనేకమంది క్రేజీ హీరోయిన్స్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో ఖరీదైన భూములను భారీ అడ్వాన్స్ లు ఇచ్చి ఎగ్రిమెంట్ లు చేసుకున్నారు అని టాక్. ఇప్పుడు కరోనా దెబ్బతో షూటింగ్ లు ఆగిపోవడంతో పాటు తమ పారితోషికాలు కూడ తగ్గించు కోవలసిన పరిస్థితులు ఏర్పడటంతో ఇంత భారీ పేమెంట్ లను భవిష్యత్ లో కడుతూ తమ వ్యక్తగత సహాయక సిబ్బందిని మెయిన్ టైన్ చేస్తూ తమ గ్లామర్ కొనసాగిస్తూ ఇండస్ట్రీలో ఎలా నిలదొక్కుకోవాలి అన్న టెన్షన్ లో చాలామంది క్రేజీ హీరోయిన్స్ ఉన్నట్లుగా ఆకథనంలో పేర్కొనబడింది.


అయితే ఇలాంటి వ్యతిరేక పరిస్థితులు కొనసాగుతున్న ఈలాక్ డౌన్ పిరియడ్ లో కూడ క్రేజీ హీరోయిన్స్ తమన్నా కాజల్ లు తమ ఇంటి నుండి బయటకు రాకుండానే కేవలం ఒకొక్క పోస్టుకు లక్షలు గణిస్తున్న షాకింగ్ న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది. కాజల్ తమన్నాలకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయర్స్ లక్షల సంఖ్యలో ఉండటంతో అనేక కంపెనీలు తమ కంపెనీల ఫ్యాషన్ ప్రొడక్ట్స్ ను తమ ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో ప్రమోట్ చేయడానికి ఒకొక్క పోస్ట్ కు లక్షల స్థాయిలో భారీ మొత్తాలు తీసుకుంటూ ఈలాక్ డౌన్ పిరియడ్ లో చాల బిజీగా ఉన్నారట. దీనితో తమన్నా కాజల్ ల లాక్ డౌన్ సంపాదన చూసి అనేకమంది క్రేజీ బ్యూటీలు ఆశ్చర్యపడుతూ వారి పై ఈర్ష్య పడుతున్నట్లు టాక్..  

మరింత సమాచారం తెలుసుకోండి: