సాధారణంగా స్టార్ హీరో అయిన తర్వాత దర్శకులు హీరో కోసం ఎదురు చూసే పరిస్థితి ఉంటుంది. ఏ దర్శకుడు అయినా సరే స్టార్ హీరో తో సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించే వాతావరణం ఉంటుంది అని మనం వింటూ ఉంటాం కాని టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ విషయంలో అలా ఉండదు అని అంటూ ఉంటారు ఆయన గురించి బాగా తెలిసిన వాళ్ళు. అతని తో సినిమా చేయడానికి ఎవరూ కూడా ఎదురు చూసి బాధ పడే అవకాశం ఉండదు అని అంటారు. అంటే అతని తో సినిమా చేయరు అని కాదు. 

 

అతను సినిమా చేయడానికి స్వయంగా పిలుస్తూ ఉంటాడు అని సమయం చూసుకుని తనతో సినిమా చెయ్యాలి అనుకునే దర్శకుల కథలను వింటాడు అని అంటారు. జై లవ కుశ దర్శకుడు బాబీ కి ఎప్పటి నుంచో తారక్ తో సినిమా చేయడం అనేది ఇష్టం. ఆ విషయం తెలుసుకున్న తారక్ అతనిని స్వయంగా ఇంటికి పిలిచి కథ విని సినిమాను ఫైనల్ చేసి చెప్పిన సమయానికి అతనికి కావాల్సిన విధంగా సినిమాను పూర్తి చేసి ఇచ్చాడు. ఇక హరీష్ శంకర్ విషయంలో కూడా ఇదే జరిగింది. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా అతను దర్శక నిర్మాతలకు ఫోన్ చేస్తాడు ఆని చెప్తారు. 

 

టాలీవుడ్ లో ఈ స్థాయిలో ఏ హీరో కూడా లేడు అని చెప్తూ ఉంటారు జనాలు. ఒక స్టార్ హీరో కి కథ వినిపించాలి అంటే దర్శకుడు అయినా నిర్మాత అయినా సరే నరకం చూసే పరిస్థితి ఉంటుంది. కాని తారక్ విషయంలో దాదాపుగా అలా ఎక్కడా కూడా ఉండే అవకాశం లేదు అని అంటారు టాలీవుడ్ జనాలు. అతను ఎవరు ఏ స్టోరీ చెప్పినా వింటాడని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: