రామ్ గోపాల్ వర్మ తన ‘క్లైమాక్స్’ మూవీని మే 29న ప్రేక్షకుల ముందుకు  తీసుకువస్తున్నాడు. అయితే థియేటర్లు మూతపడి ఉన్నపరిస్థితులలో తన సినిమాను ఏదో ఒక ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై విడుదలచేయకుండా వర్మ తన ‘క్లైమాక్స్’ విడుదలకోసం ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆర్జీవీ వరల్డ్ థియేటర్ పేరుతో సొంతంగా ఒక వేదిక ఏర్పాటు చేసుకున్నాడు అందులోనే ‘క్లైమాక్స్’ విడుదలకాబోతోంది. 


ఈ నెల 29న ఉదయం 11 గంటల నుంచి ‘క్లైమాక్స్’ స్ట్రీమింగ్ మొదలవుతుంది. పే పర్ వ్యూ లెక్కన సినిమా చూడొచ్చు అని చెపుతున్నాడు. సినిమా చూసేందుకు థియేటర్లలో లాగే ఇక్కడా ఒక రేటు ఉంటుంది ఆ మొత్తం చెల్లించి ఆన్ లైన్లో సినిమా చూడొచ్చు. ఓటీటీ డీల్స్ కంటే కూడా సొంత ఛానల్ లో ఒకరేటు పెట్టి సినిమా విడుదల చేస్తే  ఎక్కువ ఆదాయం వస్తుందని వర్మ ఈ కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. 


ఈ పరిస్థితుల నేపధ్యంలో తన కొత్త ఛానల్ ను ప్రమోట్ చేస్తూ నిన్న ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ అనేక ఆసక్తికర విషయాలు వెల్లడిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. తన ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో వచ్చే సినిమాలు ప్రేక్షకులను ‘ఆహా ఆహా’ అనిపిస్తాయి అంటూ తన ఛానల్ పై అంచనాలు పెంచాడు. 


ఈ సందర్భంలో ఆ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్న ఆ మీడియా సంస్థ ప్రతినిధి వర్మ వైపు చూస్తూ అల్లు అరవింద్ ‘ఆహా’ ఒటీటీ ప్రస్తావన తీసుకు వచ్చాడు. వర్మ మాత్రం అటువంటి ఒటీటీ ఒకటి ఉందని తనకు తెలియదు అని అనడమే కాకుండా అల్లు అరవింద్ ‘ఆహా’ పెట్టారు అని తనకు తెలియదు అనీ  తాను చూడలేదనీ కామెంట్ చేసాడు. ఇదే సందర్భంలో వర్మ మాట్లాడుతూ తాను కరోనా వైరస్ కన్నా భయంకరంగా మారి జనం ఆలోచనలను కలుషితం చేయబోతున్నాను అని అంటూ త్వరలో తాను కరోనా వైరస్ పై గాంధీ ని హత్య చేసిన గాడ్సే పై రామాయణంలోని కొన్ని సంఘటనల పై కొన్ని వివాదాస్పద సినిమాలు తీయబోతున్నాను అంటూ చాల గొప్పగా చెప్పుకుంటూ తనకు ఎన్ని వివాదాలు వస్తే అంత పాపులారిటీ అంటూ తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: