భారీ  యాక్షన్  సీన్స్ కు .. పవర్ ఫుల్ డైలాగ్స్ కి..పెట్టింది పేరు బాలయ్య, ఆయన సినిమాలు.. ఇక బాలయ్యతో ఢీ కొట్టబోయే విలన్ అంటే.. అది ఆయన ఎనర్జీకి తగ్గట్టు ఉండాలి.. అందుకే బాలయ్య సినిమా కోసం పవర్ ఫుల్ విలన్స్ ను వెతుకుతున్నాడు బోయపాటి.

 

నటసింహం బాలకృష్ణ సినిమా అంటే ఫ్యాన్స్ కు పండగే..బాలకృష్ణ సినిమాలంటే సహజంగానే డైలాగ్స్.. యాక్షన్ సీక్వెన్స్ లను ఊహించుకుంటారు ఆయన ఫ్యాన్స్.. దానికి తగ్గట్టు బాలకృష్ణకు సవాల్ విసిరే పవర్ ఫుల్ విలన్ ఉంటే అభిమానులకు పండగే.. అందుకు నటసింహం ప్రతి సినిమాలో పవర్ ఫుల్ విలన్ ఉండేట్టు చూసకుంటున్నారు దర్శకులు. జగపతి బాబు లాంటి స్ట్రాంగ్ అండ్ స్టైలీష్ విలన్ ను బాయలయ్యకు ఆపోజిట్ గా బరిలో నిలిపాడు బోయపాటి.

 

ప్రస్థుతం బాలయ్య బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ముచ్చటగా మూడో సినిమా చేస్తున్నాడు. వీరి కాంబినేషన్‌లో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్‌ సినిమాలు ఏ రేంజ్‌లో హిట్టయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఈ మూవీతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు శీను. అయితే ఈ సినిమాలో మెయిన్ విలన్ గా హీరో శ్రీకాంత్ ను దాదాపు కన్ ఫామ్ చేశారు.

 

నటసింహంతో పోరాటం కోసం శ్రీకాంత్ తో పాటు బాలీవుడ్ నుంచి మరో విలన్ ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. బోయాపాటి సినిమాలో హీరోయిజంతో పాటు విలనిజాన్ని ఎంత క్రూరంగా చూపిస్తాడో అందరికి తెలిసిందే.. ఇప్పుడు ఈ ఇద్దరు విలన్లతో పాట మరికొంత మందిని నెగెటీవ్ క్యారెక్టర్లను తీసుకుని, బాలకృష్ణతో భారీ యాక్షన్ సీన్ తీయ్యబోతున్నాడు. మామూలుగా డైలాగ్ చెబితేనే ఊగిపోయే బాలయ్య ఫ్యాన్స్ .. ఇంతమంది విలన్స్ తో బాలయ్య చేసే ఫైట్స్ ఎలా ఉంటాయో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: