నా ఫ్లాప్ సినిమాలు కూడా కోట్లు కురిపిస్తాయని పబ్లిక్ గానే స్టేట్ మెంట్ ఇచ్చాడు సల్మాన్ ఖాన్..  అది అక్షరాలా నిజం. అందుకే  కొన్నేళ్ల నుంచి  వరల్డ్ వైడ్ గా బాలీవుడ్ బాక్సాఫీస్ కింగ్ గా ఫస్ట్ ప్లేస్ ని కంటిన్యూ చేస్తున్నాడు ఈ స్టార్ హీరో. సినిమా హిట్ , ఫ్లాప్ తో సంబందం లేని కలెక్షన్ల తో టాప్ ర్యాకింగ్స్ తో నేనే నంబర్ వన్ అంటున్నాడు సల్లూ బాయ్.

 

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ .. వరల్డ్ వైడ్ బాలీవుడ్ బాక్సాఫీస్ కింగ్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు . సినిమా  ఎలా ఉన్నా.. సంబందం లేదు .. కలెక్షన్లు  మాత్రం  ఫుల్ గా వస్తాయి సల్మాన్ ఖాన్ సినిమాలకు . 2017 లో టైగర్ జిందా హై సినిమాతో మ్యాసివ్ హిట్ అందించిన సల్మాన్ .. అదే సంవత్సరం ట్యూబ్ లైట్ తో డిజాస్టర్ ఫేస్ చేశాడు. అయినా సరే ఫేమ్ తగ్గలేదు.

 

ఎన్నో ఎక్స్ పెక్టేషనస్ తో వచ్చిన రేస్ 3 అస్సలు అడ్రస్ లేకుండా పోయింది. పెద్దగా ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా వచ్చిన భరత్ - 200 కోట్లు,  దబాంగ్ 3 సినిమా 150 కోట్లు కలెక్ట్ చేసింది. అందుకే సల్మాన్ ఖాన్ పబ్లిక్ గా `నా ఫ్లాప్ సినిమాలు కూడా మిగతా హీరోల హిట్ సినిమాల కంటే ఎక్కువ కలెక్ట్ చేస్తా`యన్నాడు.

 

ఈ బాక్సాఫీస్ కలెక్షన్లతో సల్మాన్ ఖాన్ కొన్నాళ్ల నుంచి వరల్డ్ వైడ్  బిగ్గెస్ట్ బాక్సాఫీస్ స్టార్ హీరో గా రికార్డ్ క్రియేట్ చేస్తున్నాడు . ఓవర్సీస్ లో  కూడా వరల్డ్ వైడ్ గా థర్డ్ ప్లేస్ లో కంటిన్యూ అవుతున్నాడు. కానీ ఇండియా వైడ్ గా మాత్రం బాలీవుడ్ కలెక్షన్ కింగ్ సల్మాన్ ఖానే . ఇలా సినిమాలతో సంబందం లేకుండా కలెక్షన్లతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ లో కూడా నేనే నంబర్ వన్ అనిపించుకుంటున్నాడు సల్మాన్ ఖాన్.

మరింత సమాచారం తెలుసుకోండి: