ఆర్.ఆర్.ఆర్ సినిమా కోసం కలిసి పనిచేస్తున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ ల మధ్య స్నేహం మరింత బలబడ్డదని తెలుస్తుంది. మాములుగా ఆ హీరోల మధ్య సినిమాల ఫైట్ చాలా టఫ్ గా ఉంటుంది. అంతేకాదు మెగా నందమూరి అభిమానుల మధ్య వైరం మాములుగా ఉండదు. కానీ సమీకరణాలు మారాయి సినిమాను అందరం కలిసి ఆడించే రోజులు వచ్చాయి. స్టార్స్ మధ్య ఉన్న సత్సంబంధాలు బయటపడుతున్నాయి. కేవలం సినిమాలతోనే తమ ఫైట్ పర్సనల్ గా కాదని తారలు చెబుతుండగా ఫ్యాన్స్ లో కూడా మార్పు వచ్చింది. 


ఇక ట్రిపుల్ ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా చెర్రీ బర్త్ డే నాడు మా అన్న మన్నెం దొర అల్లూరి అంటూ తారక్ చెప్పిన డైలాగ్ దుమ్ముదులిపేసింది. అయితే రామ్ చరణ్ కూడా ఎన్టీఆర్ బర్త్ డే నాడు సర్ ప్రయిజ్ టీజర్ ఇస్తాడని అనుకున్నారు కానీ అది కుదరలేదు. అయితే రాజమౌళి ప్లాన్ ప్రకారం కొమరం భీమ్ టీజర్ ఇవ్వలేకపోయినా చరణ్ కచ్చితంగా ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో ఏదో ఒక విధంగా సర్ ప్రయిజ్ ఇస్తాడని అంటున్నారు. 


ఫ్యాన్స్ కోసం ఏమాత్రం కాంప్రమైజ్ కానీ రాజమౌళి తొందరపడి ఏదో ఒక టీజర్ రిలీజ్ చేయకుండా మొన్నటి వరకు ప్రయత్నించి ఆ తర్వాత చేతులెత్తేశాడు. కానీ ఆర్.ఆర్.ఆర్ టీం నుండి కచ్చితంగా ఏదో ఒక స్పెషల్ అప్డేట్ వచ్చి తీరుతుందని అది కూడా రామ్ చరణ్ చేతుల మీదగా రిలీజ్ చేస్తారని ఇన్నర్ టాక్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఎన్టీఆర్ కు అభిమానుల నుండి పెద్ద ఎత్తున బర్త్ డే విషెస్ వస్తున్నాయి. సినిమాల పరంగా ఎలాంటి అప్డేట్ ఇప్పటివరకైతే రాలేదు.                   

మరింత సమాచారం తెలుసుకోండి: