మన తెలుగులో చాలా మంది హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల మీద ఎక్కువగా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమా చెయ్యాలి అనేది చాలా మందికి ఇప్పుడు ఒక డ్రీం అని అంటారు కొందరు. అది నిజమా కాదా అనేది పక్కన పెడితే పాన్ ఇండియా సినిమా చేస్తే కమర్షియల్ గా మంచి పేరు వస్తుంది. దానికి తోడు డబ్బు కి డబ్బు కూడా వస్తుంది అనే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే కొందరు హీరోలు మాత్రం అప్పుడే పాన్ ఇండియా సినిమాలు వద్దు అనే భావన లో ఉన్నారు అని అంటారు. 

 

అందులో ప్రధానంగా చెప్పుకునే హీరో జూనియర్ ఎన్టీఆర్. అతనికి పాన్ ఇండియా సినిమాల మీద ముందు నుంచి కూడా అంత ఆసక్తి ఉండదు అనేది చాలా మంది చెప్పే మాట. సినిమా విషయంలో తాను రేంజ్ చూస్తే సినిమాలో నటించలేను అని చెప్తూ ఉంటాడు అని అది తనకు చాల యిబ్బంది గా ఉంటుంది అని అంటూ ఉంటాడు. తాను సినిమా చేస్తాను అని పాన్ ఇండియా నా కాదా అనేది ప్రేక్షకులు నిర్ణయం తీసుకుని దాన్ని ఆదరిస్తారు అని తనకు ఏదో సాధించాలి అనే తపన లేదు అని అది ఉంటే తాను ఏదీ సాధించలేను అనేది తారక్ సిద్దాంతం అని అంటారు. 

 

ఎక్కడ అయినా సరే తాను ఏది చెయ్యాలి అనుకుంటే అదే చేస్తాను గాని ఏదో చెయ్యాలి అనుకుని దాని మీద ఆధారపడి చేసే రకం కాదు అని చెప్తూ ఉంటాడు. ప్రస్తుతం అతని కెరీర్ పీక్స్ లో ఉంది అనే సంగతి అందరికి తెలిసిన విషయమే. ఏ హీరో కూడా సాధించలేని పేరు ని అతను చాలా తక్కువ కాలంలో సంపాదించాడు అనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: