ఇప్పుడు తెలుగులో చాలా మంది హీరోలు తమిళ మార్కెట్ మీద ఎక్కువగా దృష్టి పెట్టిన సంగతి తెలిసి౦దే. తమిళ మార్కెట్ లో ఒకసారి హీరో హిట్ అయిన తర్వాత అతనికి తిరుగు ఉండదు అని అక్కడ హిట్ అయితే పక్కన ఉన్న కేరళ లో కూడా సినిమాలను చూస్తారు అనే భావన లో హీరోలు ఉంటూ ఉంటారు. అందుకే తమిళం మార్కెట్ మీద చిరంజీవి పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ప్రభాస్ వంటి హీరోలు ఎక్కువగా దృష్టి పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ విషయంలో ఆసలు ఎక్కడా కూడా ఆసక్తి చూపించిన సందర్భం అనేది లేదు అని అంటారు. 

 

అతనికి ముందు నుంచి తమిళం మార్కెట్ మీద అంత ఆసక్తి లేదు అనేది చాలా మంది చెప్పే మాట. తమిళం మార్కెట్ లో హీరో హిట్ కావడానికి అక్కడి అభిమానుల అవమానాలను తట్టుకోవాలని అతను భావిస్తూ ఉంటాడు అని అంటారు. అక్కడి అభిమానులకు తెలుగు హీరోలు అనగానే చిన్న హీరోలు నటన రాదు అనే అభిప్రాయం ఉంటుంది అని తనకు వారి తో అలా అనిపించుకునే అవసరం గాని మరొకటి గాని లేదు అని తనకు అంత ఖర్మ పట్టలేదు అని అంటూ ఉంటాడు. అందుకే పాన్ ఇండియా సినిమాలు అయినా తమిళం మార్కెట్ లో సినిమాలను ఆడించాలి అనే తపన గాని అతనికి లేదు అని అంటారు. 

 

నిర్మాతకు నచ్చితే ఎక్కడ అయినా సరే సినిమా చేసుకోవచ్చు అని కాని తనకు అంత ఆసక్తి వేరే భాషల మీద ఉండదు అని తనను ఎవరూ కూడా అంతగా ఇబ్బంది పెట్టవద్దు అని దర్శక నిర్మాతలకు అతను ఎన్నో సందర్భాల్లో చెప్పాడు అని అంటారు. అందుకే అతని సినిమాలు అక్కడ ఎక్కువగా వెళ్ళవు.

మరింత సమాచారం తెలుసుకోండి: