మన తెలుగులో చాలా మంది హీరోలకు త్రివిక్రమ్ తో సినిమా చెయ్యాలి అనే తపన ఉంటుంది. అతని తో సినిమా చేయడానికి మహేష్ బాబు సహా చాలా మంది హీరోలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆయన సినిమా కోసం వేరే సినిమాలను వదులుకునే హీరోలు కూడా మనకు కనపడుతూ ఉంటారు ఈ మధ్య కాలంలో. అయితే జూనియర్ ఎన్టీఆర్ తో మాత్రం ఆయన సినిమా చెయ్యాలి అని భావిస్తూ ఉంటాడు. జూనియర్ ఎన్టీఆర్ తో పదేళ్ళ క్రితమే సినిమా చేయడం కోసం చాలా ప్రయత్నాలు చేసి ఒక మంచి కథ ను కూడా సిద్దం చేసుకున్నాడు అని అంటారు. 

 

ఆ కథ కోసం అతను చాలా కష్టపడ్డాడు అని ఆ కథను  ఎలా అయినా సరే తారక్ కి వినిపించడానికి అతను చాలా ఇబ్బంది పడ్డ్డాడు అని కాని అది సాధ్యం కాలేదు అని అంటారు. తన రాతను తారక్ నోట వినాలి అనేది అతని తపన అని చెప్తూ ఉంటారు. అరవింద సమేత సినిమా ఓకే అయిన సమయంలో ఆయన తన సన్నిహితులకు పార్టీ కూడా ఇచ్చాడు అని తనకు తారక్ తో ఒక్క సినిమా చేయడం అనేది ముందు నుంచి కూడా ఒక డ్రీం అని చెప్పిన చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సినిమా ఫెయిల్ అయినా తారక్ ఫెయిల్ అయిన సందర్భం లేదు అంటాడు. 

 

అందుకే అతని తో అవకాశం కోసం వేరే హీరోలు ఎంత అడిగినా సరే అతను ముందుకు వచ్చి చేసిన సందర్భం అనేది ఎప్పుడు కూడా లేదు అనే చెప్పాలి. ప్రస్తుతం తారక్ చాలా బిజీ గా ఉన్నాడు. అయినా సరే త్రివిక్రమ్ తో మళ్ళీ సినిమా చేయడానికి గానూ కథ వినడం సినిమాను ఓకే చేయడం అనేది జరిగిపోయింది. ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: